జోగేంద్రనాధ్ మండల్! అచ్యుతునిరాజ్యశ్రీ

 పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత మహ్మదాలీజిన్నా ప్రభుత్వంలో అప్పటి తూర్పుపాకిస్తాన్ కి చెందిన హిందువైన జోగేంద్రనాధ్ మండల్ ని తొలి న్యాయ శాఖ మంత్రిగా చేశాడు.29జనవరి 1904లో బెంగాల్ ప్రెసిడెన్సీలోని బైరీసాల్ జిల్లాలో పుట్టాడు.ఇప్పుడది బంగ్లాదేశ్ లో ఉంది.నామ్శూద్ర్ కులంకి చెందిన  మండల్ బాల్యం నుంచి మహామేధావి.1934లో లా పాసైన ఆయన ప్రాక్టీస్ చేయకుండా దళితులపై జరుగుతున్న అన్యాయ అత్యాచారాలపై దృష్టి కేంద్రీకరించాడు. 1937నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉంటూ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన సరళకుమార్ దత్తాని ఓడించాడు. ఇలా తొలివిజయం సాధించిన అతనిపై సుభాష్ చంద్ర బోస్ ప్రభావం పడింది.బోస్ కాంగ్రెస్ ని విడిచిపెడ్తే మండల్ ముస్లింలీగ్ తో చేతులు కల్పాడు.అంబేడ్కర్ శిష్యుడాయన. 1946లోఎన్నికల్లోముంబైలో అంబేడ్కర్ ఓడాడు. క్రమంగా మండల్ జిన్నాకి సన్నిహితుడైనాడు🌹
కామెంట్‌లు