వికసితం: -అచ్యుతునిరాజ్యశ్రీ
ఎర్రకోటపై రెపరెపలు 
మువ్వన్నె జెండా ముచ్చటలు 
ఆపరేషన్ సిందూర్తో తేటతెల్లం
సైనిక బలాలశక్తియుక్తులు
శాంతికపోతాలు , అవసరమైతే 
చీల్చిచెండాడు గరుత్మంతులని
ఋజువు చేసిన చరిత్ర 

పందొమ్మిదివందల ముప్ఫైలో 
కాంగ్రెస్ పూర్ణస్వరాజ్ ప్రకటనతో
బ్రిటిష్ గుండెలో గునపాలు 
పందొమ్మిదివందల యాభై లో 
సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంగా 
విశ్వంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా 

భిన్నత్వంలో ఏకత్వం,సప్తవర్ణాల
సంస్కృతీ ఆచార వ్యవహారాల 
భారత్ ఆత్మ ఒక్కటే
రాజ్యాంగం అమలుతో ప్రాధమిక హక్కులు
,విధులతో ఏక్ భారత్ శ్రేష్ఠభారత్ వడివడిగా అడుగులు

రాష్ట్రాల శకటాల ప్రదర్శన తో
విశ్వమంతా కనులు విప్పార్చి ఆలోకించు, యువశక్తితో దేశం
వందేమాతరం అంటూ జయగీతాలు పాడు
ప్రజాస్వామ్యం కి పట్టంగట్టిన
నవభారతం 

వివిధ భాషల కవుల అనువాదంతో 
ఆకాశవాణి కవిసమ్మేళనంలో స్ఫూర్తి పొందిన
జనత,ముక్తకంఠంతో పాడు జనగణమన 
మహాశక్తి గా ఎదుగుతున్న భారత్
వికసిత హసిత పద్మంలా సదా 
హమారా భారత్ మహాన్,జైహింద్ 
అంటూ జేజేలందుతూ ముందుకుసాగు 

....స్వస్తి...

కామెంట్‌లు