రాగి చెట్టు మీదున్నాది
రమ్యమైన రంగు తోడ
కిలకిల పలుకుతుంది
దాని పేరు చెప్పండి
ఇంటిగచ్చు సూరులోన
గూడు అది కట్టుకుంది
కిచకిచమని అరుస్తుంది
దాని పేరు చెప్పండి
గున్న మామికొమ్మ చాటున
నల్ల రంగులోన దాగి ఉంది
కమ్మనైన పాట పాడుతుంది
దాని పేరు చెప్పండి
చిరు చిరు జల్లులు కురుస్తుంటే
చిన్నగా మెల్లిగా వస్తుంది
మైమరిసి నాట్యం చేస్తుంది
దాని పేరు చెప్పండి
గేయంలోని గుట్టు విప్పండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి