అచ్చంపేట గట్లల్లోన
వచ్చి చేరే పిచ్చుకలు
తెచ్చి పెట్టి నారా పీచు
కట్టినాయి పిట్టగూళ్ళు
కానే కాదు ఇంజనీర్
రానే రాదు పాఠశాలకు
ఎవరు నేర్పిన పరిజ్ఞానం
ఎంత చక్కటి నిలయం
అందమైన అల్లికతో
చూడ చక్కగా చుట్టి
దానికి ద్వారము పెట్టి
అందులోకి పిచ్చుక చేరి
గూటిలోన గుడ్లు పెట్టి
గుడ్ల మీద పొదిగి పిట్ట
చిట్టి పిల్లలను చేయగా
జోడి పిట్ట కాపలుండు
పిట్టల పనితనం చూశారా
ఊరు వెలపల కెళ్ళండి
పిట్టల గూళ్ళు చూడండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి