ఓటమే తల వంచాలి ! :- కోరాడ నరసింహా రావు.
విజయాలకు , పొగడ్తలకు పొంగి పోవటం ఎంత ముప్పో.. , 
  అపజయాలకు,అవహేలన లకు  క్రుంగి పోవటమూ అంతే ముప్పు...!

ఒక అపజయం... ఒక అవహేలన మనలో పట్టుదలను పెంచాలి... 

మన విజయానికి అవే మెట్లుకావాలి...! 

ఓటమి  శాపం కాదు... 
  క్రుంగి పోవటమే పాపం!! 

బాగుపడితే ఏడ్చి చెడిపోతే నవ్వే ఈ లోకాన్ని మనం పట్టించుకోవటమా...! 

నీ బ్రతుకు నీ దే... 
  అందులో కష్ట మైనా, సుఖమైన నీకే...!! 

నీ వు  నీ గురించి ఆలోచించు...!నీ విషయం లో ఇతరుల గురించి ఆలో చించ వలసిన పనేముంది!! 

ఓటమి పాలయావని... 
 ప్రయత్నించటం మానకు! 
    ఎన్ని మార్లు ఓ డి నా... 
 ప్రయత్నిస్తూనే వుండు... 
   నీ మొండి తనా నికి... 
  ఆఓటమికే విసుగు కలగాలి...! తలవంచి , విజయాన్ని నీ కందించాలి
     *****

కామెంట్‌లు