అంటరానివాడని త్రోసిపుచ్చారు…
ఎవరూ వెంటరానివాడని
ఒంటెలా ఒంటరివాడని ముద్ర వేశారు…
అవమానాల అగ్నిలో ఆత్మను కాల్చారు…
కానీ—ఆ అగ్నే తపస్సైంది…
ఆ ఒంటరితనమే జ్ఞానయాత్రైంది…
అవమానాల బూడిదలోంచి
ఒక మహాగ్రంథం పుట్టింది…
అదే—రక్తంతో వ్రాసిన రాజ్యాంగం…
అదే—తల్లి భారతమాత ఋణం
తీర్చిన అమోఘ అక్షరయజ్ఞం…
సిరా చుక్కలతో కాదు…
పుస్తకపు పుటలపై కాదు…
తన సున్నితమైన
హృదయం నుంచి
ఊరిన రుధిరధారలతో
తన కలల భారతానికి
అక్షర రూపమిచ్చిన అపరమేధావి…
మనకు స్వాతంత్ర్యం వచ్చి
ఎన్నో దశాబ్దాలు గడిచినా…
నేటి పాలనకు దిక్సూచిగా నిలిచింది
ఆ అక్షరాల వెలుగు…
ప్రతి పౌరుడికి
ఒక అజేయ రక్షణకవచమైంది
అంబేద్కర్ రాజ్యాంగం…
ప్రపంచం యుద్ధాల గర్జనతో
దద్దరిల్లిపోతున్న వేళ…
బాంబుల బీభత్సంలో
పసిపిల్లల నవ్వులు
నలిగిపోతున్న వేళ…
స్త్రీలు, వృద్ధులు రక్తపుటేరుల్లో
కొట్టుకుపోతున్న వేళ…
రాజ్యాధినేతల రాజ్యకాంక్షలు...
మానవత్వాన్ని మింగివేస్తున్న వేళ…
మన వేదభూమి మాత్రం
ఒక శాంతి సింధువై నిలిచింది…
దానికి మూలకారుడు—
మానవహక్కుల శిల్పి…
సమానత్వానికి సారథి…
రాజ్యాంగ శిల్పాకారుడు…
అమరజీవి...అందరి ఆత్మ బంధువు
డా. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్…
(అందరికీ భారతదేశ సర్వసత్తాక,
సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి