హాస్యకథ! అచ్యుతునిరాజ్యశ్రీ
 "ఏమైందిరా భయ్! ఈరోజు ఎన్.సి.సి.పెరేడ్ !డుమ్మా కొడుతుండావా? ఏంది కత!?"
"చెప్పనీకి ఏముందన్నా!24న జాతీయ బాలికా దినోత్సవం అని జర్రంత నాగోస ఎల్లగక్కినా దర్పణంలో! నీ కెరకే గదా!?"
"అవ్! గా ముచ్చట ఇప్పుడెందుకు భయ్?"
"ఎందుకంటే,నా సెల్లి నాడ్రెస్ ఏస్క పోయింది!? మొన్న నాబర్త్ డే అయిందా? మా యమ్మ జర పెద్ద సైజ్  ప్యాంట్ షర్ట్ కొన్నది.జప్ న పిల్లలు ఎదుగతారు,అందుకే ఇంటర్ దాకా వేస్కవచ్చని కొంది. దాన్ని మా అక్క వేస్క కాలేజీకి పోయింది.నేనొక్కడినే మగపిల్లగాడ్ని! ముద్దు ముచ్చట లేకపాయె! ఇద్దరాడపిల్లల మధ్య అక్క సెల్లి మధ్య నాబతుకు అధ్వాన్నం! ఆడపిల్లల కి గింత ఘనంగా స్వేచ్ఛ ఉంటే ఇంకా ప్రత్యేకరోజు అంటం న్యాయమా!? నేను మాబాపు నోరెత్తం! జర గొణిగిన మనుకో ,ముగ్గురాడోల్లు గయ్ గయ్ మంటా గూబ గుయ్ మన్పిస్తరు."ఊకో కొడకా! మన మొగోల్ల బతుకు ముళ్ల కంపపై బట్ట లెక్క ఉన్నాది .పోలీసోల్లదాకా పోతరు బిడ్డా!" అని మాబాపు ఓదార్సిండు"
"అవున్రా తమ్మీ! మనపని ఖతం కహానీ! ఊకోరా తమ్మీ!"
రిపబ్లిక్ డే స్పెషల్
ఎ.రాజ్యశ్రీ

కామెంట్‌లు