పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో మహిళా ఉపాధ్యాయనులకు ఘనంగా సన్మానించినట్లు ఉపాధ్యాయులు యందువ వెంకట రమణ, వెలగాడ రాము, ఎం.పెంటయ్యలు తెలిపారు. భారతీయ తొలి ఉద్యోగిణి సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సుమారు రెండు దశాబ్దాల క్రితమే బాలికల పట్ల వివక్షను, మూఢనమ్మకాలను, బాల్య వివాహాల వంటి దురాచారాలను నిలదీసి, ఎన్నో బాలికల పాఠశాలలను స్థాపించిన మహిళాశక్తి సావిత్రి బాయి పూలే అని అన్నారు. పాఠశాలలో మహిళా ఉపాధ్యాయనులైన ఆర్.ఎల్.కుమారి, ముల్లు సుజాత, పిల్లల దాలమ్మలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పౌరులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. తొలుత ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలికలకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రత్యేక బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు యందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం.పెంటయ్య, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
ఆర్.ఎల్.కుమారి, సుజాత, దాలమ్మలకు సావిత్రి బాయి పూలే జయంతి సత్కారాలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి