మహబూబ్‌నగర్‌లో భారత్ స్కౌట్ అండ్ గైడ్ శిక్షణ కార్యక్రమం విజయవంతం: వెంకట్ , మొలక ప్రతినిధి

 మహబూబ్‌నగర్ జిల్లాలో భారత్ స్కౌట్ అండ్ గైడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ 2026 జనవరి 17 నుంచి 23 వరకు ఏడు రోజుల పాటు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి రాజగోపాల్ సమన్వయంతో పాటు వెంకట  సుబ్బా  లక్ష్మి,భారత మాత అమర జ్యోతి మేడం శిక్షణ అందించారు. ఆమె స్కౌట్ అండ్ గైడ్ విలువలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం, శిబిర జీవన నైపుణ్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ శిక్షణలో వివిధ మండలాలకు చెందిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) ఉపాధ్యాయులతో పాటు మోడల్ స్కూల్‌లకు చెందిన PET టీచర్లు కూడా పాల్గొని శిక్షణ పొందారు.
శిక్షణలో పాల్గొన్నవారిలోఎం. బాలమణి (KGBV తాండూర్), ఈ. శ్రీలత (బషీరాబాద్), ఎం. రంజిత (యాలాల), గోపిక (పెద్దేముల్), సి. శ్రీలత (దారూర్), సురేఖ (వికారాబాద్), అంబిక (కోట్‌పల్లి), జి. సునీత (నవాబ్‌పేట్), నందిని (మార్పల్లి), లక్ష్మి (దోమ), నాగశ్రీ (కుల్కచెర్ల), పద్మజ (చౌడాపూర్), సుజాత (దౌల్తాబాద్), షన్ను బేగం (మొమిన్‌పేట్), రమ (పుదూర్), హెరాబాయి (బంట్వారం), శివలీల (కొడంగల్), నిర్మల నస్కల్ 
 మోడల్ స్కూల్ pet లు 
వెంకట్ (పూడూరు)
 యాదగిరి (తాండూరు)
 ప్రశాంత్ రెడ్డి ( గోట్లపల్లి)
 కృష్ణ రెడ్డి  (పరిగి)తదితరులు ఉన్నారు.
ఈ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు పొందిన అనుభవం విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావం పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో పాల్గొన్న ఉపాధ్యాయులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కామెంట్‌లు