సంఘ సేవకురాలు, విద్యావేత్త, తొలి ఉపాధ్యాయురాలు, క్రాంతి కిరణం, ఆదర్శమూర్తి, సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలని చాలా ఘనంగా జరుపుకున్నాం. ఉదయము ప్రార్థన పూర్తికాగానే నేను ప్రతినెల మాదిరిగానే డిసెంబర్ నెలలో పూర్తి రోజులు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు పెన్నులు బహుకరించాను. ప్రార్థన అయిపోగానే, విద్యార్థుల హాజరు తీసుకొని, వెంటనే ఈనాటి ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వీరస్వామి సర్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరము కలిసి ఆ మహా తల్లి సావిత్రి బాయి గారి చిత్రపటానికి పూలమాలలం కృతులు గావించి , వరుసగా అందరము అంజలి ఘటించాం. అనంతరం నేను వారికి జోహార్లు చెపుతూ, అందరి చేత చెప్పించాను. ప్రధానోపాధ్యాయులు మరియు పురిష ఉపాధ్యాయులు అందరం కలిసి మా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయునిలందరికీ శుభాకాంక్షలు చెప్పి స్వీట్స్ పంచాము. అనంతరం భోజనాలు చేసి, విద్యార్థులందరికీ హాజరు తీసుకోగానే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముందుగా మహిళా ఉపాధ్యాయులకు కుర్చీ ఆట, బంతి ఆట, కదలికలకు సంబంధించిన ఆటలు మా వ్యాయమ ఉపాధ్యాయులు నిర్వహించారు, మేము పిల్లలు కలిసి ఆడే ఆటలను చాలా చక్కగా ఆడుతుంటే తిలకించాం. మేడం చాలా చూడ చక్కధనం గా ఆడారు . అనంతరం సమావేశం ఏర్పాటు చేశాము. నేను స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించాను. అందరం మరోసారి ఆ అమ్మకి పుష్పాంజలి ఘటించాం. నేటి ప్రధానోపాధ్యాయులు వీరాస్వామి గారిని తొలి పలుకులు పలుకుతూ సమావేశాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానించాను, వారు చాలా సవివరంగా సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడారు. తర్వాత విద్యార్థులు సావిత్రిబాయి పూలే గారి గురించి కొందరు ఉపన్యసించారు. తొమ్మిదవ తరగతి శివాని, ఏడో తరగతి హారిక, శృతి, ఐ శృతి ల బృందము "చదువుల తల్లి బొమ్మ సావిత్రిబాయి పూలే "...అంటూ చక్కని వినసొంపైనటువంటి గేయాన్ని పాడు వినిపించారు. ఆరో తరగతి నితిన్ చక్కని పాట వినిపించాడు. ఆ తరువాత ఉపాధ్యాయులలో హిందీ మేడం అతియా సుల్తానా హింది భాషలో, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు ఉమాదేవి తెలుగులో, గణిత ఉపాధ్యాయురాలు మంగ మేడం, భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, సాంఘిక ఉపాధ్యాయులు రాజరత్నం, మరో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు జీ. వెంకటేశ్వరరావు, గణిత ఉపాధ్యాయుడు రాంప్రసాద్ గార్లు సావిత్రి బాయి పూలే గారి గురించి చాలా చక్కని సందేశాలు ఇచ్చారు. చివరగా నేను భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించి (1600 సం. ముందు రాజుల కాలం, 1600 నుండి 1950 వరకు, 1956 నుండి ఇప్పటి వరకు ) క్లుప్తంగా వివరిస్తూ, సావిత్రిబాయి పూలే గారి భర్త జ్యోతిబాపూలే గారి గురించి కొంత పరిచయం చేస్తూ, వారి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారు చేసిన సంఘ సేవ, బోధన, రచనల గురించి వివరించాను. అనంతరం భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి గారు సమావేశానికి వందన సమర్పణ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థి విద్యార్థులకు చాక్లెట్లు పంచాము. నా 23 సంవత్సరాలు సర్వీస్ లో ఇంత బాగా సావిత్రి బాయి పూలే గారి జయంతి ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోలేదు. చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా జరుపుకున్నాం. నాకైతే చాలా చాలా అందంగా అనిపించింది. పది సంవత్సరాల ఇలా జరుపుకోవాలని నా మనసులో అనుకున్నాను.
మా పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి :- నామ వెంకటేశ్వర్లు, - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అయిటిపాముల
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి