పత్రికా రంగంలో శివన్న సేవలు మరువలేనివి: ---రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య

 -- కుటుంబ సభ్యులను పరామర్శించిన ఈర్ల సమ్మయ్య


 పత్రికా రంగంలో  బాలె శివప్రసాద్ సేవలు మరువలేనివని, ప్రజల హృదయాల్లో ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఊషన్నపల్లిలో   మృతి చెందిన బాలె శివ ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని మరణానికి గల కారణాలను అతని అన్న బాలె సమ్మయ్య, కుమారులు అజయ్ కుమార్, హర్షద్ లను అడిగి తెలుసుకున్నారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య  మాట్లాడుతూ... తాను ఉద్యోగంలోకి రాకముందు ఆరు సంవత్సరాల పాటు 'ఈనాడు' రిపోర్టర్ గా పనిచేశానని, అది నాకు గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. గత ఇరవై ఏళ్లుగా తనకు శివప్రసాద్ తెలుసని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని  ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శివన్న అందరివాడని, నిజాన్ని నిర్భయంగా రాసే సత్తా గలిగిన గొప్ప పాత్రికేయుడని, ఆయన సేవలను కొనియాడారు. ఈర్ల సమ్మయ్య వెంట ధరణి మణికంఠ, పైడిపల్లి సతీష్ తదితరులు ఉన్నారు.
కామెంట్‌లు