శ్రీమాత్రేనమః....అచ్యుతునిరాజ్యశ్రీ

 ఈసృష్టిఅంతా దైవీస్వరూపం.అమ్మలగన్నయమ్మ చాల పెద్దమ్మ అన్నారందుకే.త్రిమూర్తులశక్తులన్నీ ఆమెవే.అందుకే గాయత్రీ మంత్రజపంతో మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుంది.ఆమెకెన్నోపేర్లు.అందులో ఒకపేరు భ్రమరాంబ. ఈపేరుఎలా వచ్చిందో తెలుసా? ఒకప్పుడు పాతాళలోకానికిచెందిన అరుణుడు అనే రాక్షసుడు గాయత్రీమంత్రజపంలో మునిగిపోయాడు. ఓంభూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం...అలా సదా జపించటంతో ముల్లోకాలు గంగవెర్లెత్తాయి.ఇంద్రుడికి భయం పట్టుకుంది తన పదవి పోతుందని.బ్రహ్మ దగ్గర కెళ్లి మొరపెట్టుకున్నాడు. ఆయన గాయత్రీమాతతో అరుణునికి ప్రత్యక్ష మైనాడు.ఎవరిచేత చంపబడరాదని, రెండు 4కాళ్లున్న ప్రాణుల చేత చావులేని వరం కోరాడు.తథాస్తు అన్నాడు బ్రహ్మ. ఇంకేముంది? మదగర్వం అహంకారంతో ఇంద్రుని తరిమేశాడు.ఇంద్రుడు లబలబలాడుతూ గురువైన బృహస్పతి శరణువేడాడుఅరుణుని దుండగాలుఆగడాలను గూర్చి చెప్పి కర్తవ్యబోధ చేయమన్నాడు.దేవగురువన్నాడు" వాడు గాయత్రీమంత్రం జపిస్తున్నంతకాలం వాడిని ఎవరూ జయించలేరు. అది మానేలాగా నేను ప్రయత్నిస్తాను " అని అరుణుని దగ్గర కెళ్లి కాసేపు కబుర్లలో పెట్టి" మన ఇద్దరం మంచి మిత్రులం ఎందుకంటే గాయత్రీమంత్రోపాసకులం" అనేటప్పటికి వాడికి రోషం కోపం వచ్చింది." నేను దానవేంద్రుడ్ని.నీవు దేవగురువువి.నాఉపాసన దీక్ష ముందు నీవు బలాదూర్.ఇప్పటినుంచి నేను గాయత్రీ జపం చేయను" అనడంతో వాడి శక్తి పోయింది.బృహస్పతి యుక్తి పారింది. అంతే ఇంద్రుడు గాయత్రీమాతను పూజించుట చే ఆమె అరుణుడిపైకి ఆరుకాళ్లజీవులు నల్లని భ్రమరాలు తేనెటీగలొచ్చి దాడిచేసి వాడిని కుట్టి కుట్టి చంపాయి.అరుణుని చావుతో మునులు దేవతలు గాయత్రీమాతను స్తుతించారు.ఇంద్రుడు తన పదవిని పొందాడు.ఇది ఆధ్యాత్మిక కథ.ఇక మనం సదా స్మరణ చక్కని ఉచ్ఛారణ తో చేస్తుంటే భౌతిక మానసిక ఆరోగ్యం కల్గటం తధ్యం🌹
కామెంట్‌లు