భారత రాజ్యాంగం మన జీవన గమనాన్ని నిర్దేశిస్తుందని, ప్రపంచంలోనే ఇది అత్యంత అద్భుతమైన పుస్తకమని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. సోమవారం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండావిష్కరణ అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడుగురు సభ్యులు గల ముసాయిదా (డ్రాప్టింగ్) కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన అపరమేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాత్రింబగళ్లు కష్టపడి రాజ్యాంగ రచన చేశారని, అందుకే ఆయనకు 'భారత రాజ్యాంగ పిత' అని పేరుందన్నారు. మత గ్రంథాలు మానసిక స్థిరత్వాన్ని కలిగిస్తే, భారత రాజ్యాంగం మానవ జీవన ప్రమాణాలను పెంపొందిస్తుందని, అది వారిని ఉన్నతులను చేస్తుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగంలో మనం చేయాల్సిన పనులు చేయకూడని పనుల గురించి ఉంటుందని, దీనివల్ల క్రమశిక్షణ, సత్ప్రవర్తన పెంపొందుతుందన్నారు. పిల్లలు తప్పకుండా ప్రతిరోజు భారత రాజ్యాంగం పుస్తకం చదవాలని ఆయన సూచించారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని ఆయన కోరారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన బాల బాలికలకు బహుమతులను అందజేశారు. అంతకుముందు పిల్లలు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కలిసి గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన నినాదాలు చేస్తూ గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భారతమాత, తెలంగాణ తల్లి, సైనికులు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గాంధీ, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, మత సమానత్వాన్ని ప్రతిబింబించే హిందువు, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలే కాకుండా ఇతర దేశ నాయకుల వేషధారణలో పాఠశాల పిల్లలు పలువురిని ఆకర్షించారు. కార్యక్రమంలో వీరి వివిధ వేషధరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ పెండ్లి స్వరూప, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, తల్లిదండ్రులు, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
'రాజ్యాంగం మన జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది': -- ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి