ఆధ్యాత్మిక సాహితీవేత్త " కావ్యసుధ "కు ఘన సన్మానం

 జాతీయ నేషనల్ టీచర్స్ సెమినార్ లో.. అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, డాక్టర్ కె శ్రీదేవి, ప్రొఫెసర్ వి సుధాకర్ చే ఆధ్యాత్మిక సాహితీవేత్త " కావ్యసుధ "కు  ఘన సన్మానం
సికింద్రాబాద్  అలీ యవర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిసబిలిటీస్ రీజినల్ సెంటర్ లో 7 , 8 తేదీలలో నేషనల్ టీచర్స్ సెమినార్ ఏర్పాటు చేశారు.తొలి రోజు సెమినార్ ప్రారంభోత్సవానికి సంస్థ  అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించారు. చాణక్య యూనివర్సిటీ  ప్రొఫెసర్ వి. సుధాకర్ గారు సదస్సుకు హాజరై సంస్థ చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమాలను అభినందించారు.
   బుధ, గురువారాల్లో జరిగిన  భారతీయ ఉన్నత విద్య , ఉపాధ్యాయ విద్యలో ఆందోళనలు సవాళ్లు ,  ఆవిష్కరణలు అనే అంశంపై జాతీయ సెమినార్ ప్రారంభోత్సవ సమావేశానికి ప్రముఖ కవి, జర్నలిస్ట్, ఆధ్యాత్మికవేత్త  " కావ్యసుధ" ముఖ్య అతిథిగా పాల్గొని  " "భారతీయ సనాతన సాంప్రదాయాల గూర్చి ప్రసంగిస్తూ సనాతన ధర్మ విధులు మానవ జీవితానికి అన్వయించుకొని సనాతన ధర్మాలను కాపాడడం మన బాధ్యత,మన ధర్మం. సనాతన హిందూ ధర్మం అంటే శాశ్వతమైన నిత్యమైన ధర్మం ఇది హిందూ మతానికి మరొక పేరు దీని మూలాలు మానవ చరిత్రకు అతీతమైనవి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలైనా రామాయణం మహాభారతం దేనికి ప్రాథమిక గ్రంథాలని ఇందులో నిజాయితీ,అహింస, దయ,సత్యం వంటి సార్వత్రిక విలువలతో పాటు ప్రతి వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం ఆధారపడి కర్తవ్యాలను నిర్వహించడం ముఖ్యమైనవని,'సనాతన' అంటే శాశ్వతమైన అని 'ధర్మ' అంటే నియమం లేదా జీవన విధానం అని అర్థమని కాబట్టి దీనిని శాశ్వతమైన ధర్మం అని, ఇది మానవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి, యోగ, ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానానికి మార్గమని, మానవ జీవితానికి అవసరమైన శాశ్వతమైన ధర్మాలను అందిస్తుందని, సనాతన ధర్మాన్ని వైదిక సాంప్రదాయం ధర్మం కర్మలకు సంబంధించిన అంశాలను వివరిస్తుందని గుడ్డి నమ్మకాలను రద్దు చేస్తుందని ఆత్మ నిగ్రహం వంటి నైతిక విలువలను బోధిస్తుందని సోదాహరణంగా వివరిస్తూ ప్రతి జీవిలో దైవత్వాన్ని చూస్తూ సర్వేజనా సుఖినోభవంతు అనే భావనతో జీవించడం సనాతన ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు.
        డాక్టర్ కే శ్రీదేవి ప్రసంగిస్తూ  
భారతీయ ఉన్నత విద్య మరియు ఉపాధ్యాయ విద్య దేశం యొక్క మేధో, సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థలలో ఒకటైన భారతదేశం, నాణ్యత, ప్రాప్యత, సమానత్వం, సంబంధిత ఉపాధికి సంబంధించిన బహుళ సవాళ్లను ఎదుర్కొంటుంది. ఉపాధ్యాయ విద్య, ముఖ్యంగా, అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో కేంద్రంగా ఉంది, ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థకు వెన్నెముక. మరియు
వేగవంతమైన ప్రపంచీకరణ, సాంకేతిక పురోగతులు మరియు మారుతున్న సామాజిక అవసరాలు పాఠ్యాంశాల రూపకల్పన, బోధన, అంచనా మరియు వృత్తిపరమైన అభివృద్ధిలో ఆవిష్కరణలను తప్పనిసరి చేశాయి. జాతీయ విద్యా విధానం (NEP) 2020, డిజిటల్ అభ్యాస కార్యక్రమాలు మరియు ఫలితాల ఆధారిత విద్య వంటి విధానాలు 21వ శతాబ్దపు డిమాండ్లను తీర్చడానికి ఉన్నత విద్యా సంస్థలను మరియు ఉపాధ్యాయ తయారీ కార్యక్రమాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని డాక్టర్ కే శ్రీదేవి జాతీయ నేషనల్ టీచర్స్ సెమినార్ నిర్వాహకురాలు, వివరించారు.
     "కావ్యసుధ"ను  అలీ యవర్ జంగ్  నేషనల్ ఇన్స్టిట్యూట్  సికింద్రాబాద్  రీజినల్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, డాక్టర్ కే శ్రీదేవి, చాణక్య యూనివర్సిటీ ప్రొఫెసర్ సుధాకర్ గార్లు ఘనంగా శాలువా, పూల తోటి, మెమెంటో, సర్టిఫికెట్తో సన్మానించారు. ఈ సభలో 100 మందికి పైగా ఉపాధ్యాయులు,విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్రియేటివ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సెంటర్ గైడియన్స్ మార్కెటింగ్ మేనేజర్ డి కమలాకర్  బాలబాలికల మనస్తత్వాల గూర్చి ప్రసంగించారు.
     ఈ సదస్సులో వందకు మందికి పైగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
       సంస్థ  అసిస్టెంట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు గారు అధ్యక్షత వహించే, ఈ రెండు రోజుల సదస్సు కార్యక్రమాలు డాక్టర్ కే శ్రీదేవి కన్వీనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.
డాక్టర్ కే శ్రీదేవి వందన సమర్పణ తో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

కామెంట్‌లు