అదేకదా జీవితం..!:- డా. అరుణ కోదాటి (అక్కిరాజు )- హైదరాబాద్
గతం ఒక జ్ఞాపకం,
వర్తమానం ఒక వాస్తవం 
భవిష్యత్తు ఒక ఊహ.

వయసు పెరుగుతుంటే
 గతం పెరుగుతుంది.
ఆ గతంలోఎన్నో అనుభవాలు.
సంతోషాలు,సుఖాలు,బాధలు, కష్టాలు,కన్నీళ్లు,అవమానాలు, పొగడ్తలు,
సన్మానాలు,చీత్కారాలు.
ఇవన్నీ కలిస్తేనే జీవితం.

మార్చలేని గతంలో మంచిని, ఆనందాన్ని మాత్రమే గుర్తుంచుకుంటూ,
బాధపెట్టిన జ్ఞాపకాలను మరిచిపోతూ నడిపేదే జీవనం.

నూతన సంవత్సరంలో కష్టాలు లేకుండా సుఖాలు మాత్రమే రావాలని కోరుకోకూడదు,
ఎన్ని కష్టాలుఎదురైనా వాటిని  తట్టుకునే శక్తి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకోవాలి.
పెద్దలు కూడా చిరంజీవులను 
అలాగే అశ్వీర్వదించాలి.

ఓటమి తప్పుకాదు 
ప్రయత్నం గొప్ప 
ఒడినవారు గెలిచి నిలవడం గొప్ప.
పరుగెత్తితే  కిందపడి దెబ్బలు తగులుతాయని ఉన్న చోటే ఉంటే ఎలా?
వడి వడిగా నడవాలి, పరుగెత్తాలి 
కిందపడిన చోటే నిలబడి పరుగెత్తాలి.
అప్పుడే విజయం విలువ తెలుస్తుoది

 అవమానాలే, ఆభరణాలు,
 చీత్కారాలే, సత్కారాలు  అన్నాడు ఒక కవి 
రాళ్లు తగిలినప్పుడే ఎవరు ఏంటో తెలుస్తుంది 
జీవితం అంటే పూలరహదారే కావాలని కోరుకోకూడదు.

మానవ జీవితంలో ప్రతి దశలోనూ 
ఏ పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ 
నిశ్చలంగా ఉంటూ ప్రతి దశలోనూ ఆనందాన్నే అస్వాదిస్తుంటే 
అదే పెరుగుతున్న వయసును,
అనారోగ్యాన్ని దరికి రానివ్వని ఔషధం 

ఆడంబర జీవితం కాదు 
ఉన్నదాంట్లో ఆనందకర జీవితం ఆశించాలి..అదే..
పాశ్చాత్య పోకడలు వద్దు 
మన సంస్కృతే ముద్దు 
నేటి యువత తెలుసుకోవలిసిన 
వాస్తవం.
ఎవరిజీవితం వారిదే పక్కవారితో పోల్చుకుంటేనే తిప్పలు.
  
రాబోయే నూతనవత్సరంలో అంతా శుభమే జరగాలని కోరుకుంటూ..

మీ
డా. అరుణకోదాటి
( అక్కిరాజు )
హైద్రాబాద్

కామెంట్‌లు