ఒకరోజు ఉదయం, ఉడుతలు భగవాన్ మంచంమీద ఎప్పటిలాగే జీడిపప్పు కోసం అంటూ ఇటూ తిరుగుతున్నాయి.
అయితే భగవాన్ ఎప్పుడూ ఉండే
డబ్బాలో జీడిపప్పులు లేకపోవడంతో, భగవాన్ రమణ మహర్షి వాటికి వేరుశెనగలు ఇచ్చారు. అయితే ఉడుతలకు వేరుసెనగల
రుచి నచ్చలేదు.
భగవాన్ రమణ మహర్షి దగ్గర్లో ఉన్న కృష్ణస్వామితో, "స్టోర్ రూములో మరేవైనా ఉన్నాయేమో చూడు" అని అన్నారు.
సరేనని కృష్ణస్వామి వెళ్ళి ఓ పది గింజలు తెచ్చారు.
"ఏంటీ ఇంతేనా?" అని భగవాన్ అన్నారు.
కృష్ణస్వామి, "పాయసం కోసం సరిపడేంత మాత్రమే ఉంది. అందుకే వాళ్ళు నాకు ఇంతే ఇచ్చారు" అన్నారు.
"వీళ్ళకు పాయసంలో జీడిపప్పు ఉంటేనే నచ్చుతుందేమో...లేకుంటే తినరేమో... పాయసంలో జీడిపప్పు లేకుంటే ఏమిటంట? పాపం వీటి సంగతి చూడు...వీటికేమో వేరుశెనగలు నచ్చలేదు. ఎలా అల్లరి చేస్తున్నాయో చూడు!" అని అన్నారు భగవాన్.
దాంతో కృష్ణస్వామి లోపలకు వెళ్ళి, పాయసం కోసం ఉంచిన జీడిపప్పులను తీసుకొచ్చారు. ఉడుతలకు పెట్టారు.
తీరా ఆరోజు సాయంత్రం, డాక్టర్ అనంత నారాయణరావు అనే ఆయన ఆశ్రమానికి వచ్చారు. ఆయన వస్తూ వస్తూ ఉడుతల కోసం మూడు కిలోలు తెచ్చాను' అంటూ జీడిపప్పులను రమణ మహర్షికి అందించారు.
భగవాన్ రమణమహర్షి చిరునవ్వుతో కృష్ణస్వామి వంక చూసి, "చూసేవా! ఉడుతలు తమకు అవసరమైనది తామే స్వయంగా సంపాదించు కున్నాయి. ఇకపై అవి నన్ను అడగాల్సిన అవసరం లేదు. వాటి ఆస్తి ఇది. వీటిని ఇక్కడే డబ్బాలో ఉంచండి...స్టోర్ రూముకి పంపకండి!" అన్నారు భగవాన్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి