తిరుపతి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రచయిత ఆర్సీ కృష్ణస్వామి రాజు రచించిన చింతల చేను నవల ఆవిష్కరణ సభ ఆదివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగింది. పుస్తక సమీక్షకులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...
రచయితకు ప్రకృతితో, సమాజంతో కలిగిన సంఘర్షణ కారణంగా రచనకు బీజం వేస్తుంది.
ఈ నవల లో గ్రామ జీవనం, మారుతున్న ఆర్థిక వ్యవస్థ, కొత్త ఆశలు, రైతులు వ్యాపారాలు చేసుకునే కొత్త విధానంలోకి మారడం, అక్కడ దెబ్బతినడం వంటి సమకాలీన అంశాలు అనేక ఉన్నాయి. జీవితంలోని వైరుధ్యాలను చిత్రించిన చక్కని నవల చింతల చేను అని అన్నారు.
సభకు తిరసం గౌరవ అధ్యక్షులు ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు అధ్యక్షత వహించారు. ద్రవిడ విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాగా శంకరంబాడి సుందరాచారి పీఠం అధ్యక్షులు డాక్టర్ డి. మస్తానమ్మ, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ భీమన్న ఆత్మీయ అతిధులుగా హాజరయ్యారు. రచయితను అభినందించారు. సభలో నవల రచయిత ఆర్సీ కృష్ణస్వామి రాజు, తిరసం ప్రధాన కార్యదర్శి మన్నవ గంగాధర ప్రసాద్, సాకం నాగరాజ, వాకా ప్రసాద్, ఎస్పీడ్బ్లూ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మీ, నాదెళ్ల శ్రీమన్నారాయణ, గాలి గుణ శేఖర్, మౌని, కొత్వాలు అమరేంద్ర, సురేంద్ర రొడ్డ, గరికపాటి రమేష్ బాబు తదితర సాహితీ ప్రియులు పలువురు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి