కర్వర్ రామమూర్తి కంటిలోని శ్రీ మఠంలో సేవ చేసే వారు. ఆయనకు సెలవు కావాల్సి వచ్చింది. "మా అమ్మగారి అంత్యక్రియలు...." అని చెప్పాడు.
కంచి పరమాచార్య "అలాగా, నువ్వు ఊరికెళ్లిరా " అని మాత్రమే అన్నారు.
శ్రీమఠంలో ఉన్న నిబంధనల ప్రకారం, ఆయనకు సాధారణ జీతంతో పాటు అదనంగా ఒక నెల జీతం ఇచ్చి పంపారు.
తీరా మరుసటి రోజు రామమూర్తి తల్లి పరమాచార్యులవారి దర్శనం కోసం మఠానికి వచ్చారు.
అప్పుడు రామమూర్తి తన తల్లి బ్రతికి ఉండగానే, ఆమె మరణించినట్లు అబద్ధం చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడని మండలంలోని వారందరికీ తెలిసిపోయింది.
రెండు రోజుల తర్వాత రామమూర్తి తిరిగొచ్చినప్పుడు జరిగిన విషయం తెలుసుకున్నాడు. తాను అబద్ధం చెప్పానని గ్రహించిన రామమూర్తికి పరమాచార్యులవారిని చూసే ధైర్యం లేకపోయింది. ముఖం చెల్లలేదు.
దాంతో ఆయన చడీచప్పుడూ లేకుండా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయి, వేర్వేరు పట్టణాలలో పని చేసుకుంటూ రోజులు గడిపారు.
ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన ఒకరోజు పరమాచార్యులవారి దర్శనానికి వచ్చారు.
ఏమీ ఎరగనట్లు పరమాచార్య తమ సహజ ధోరణిలో "మీ అమ్మగారు క్షేమంగా ఉన్నారా?" అని అడిగారు.
"అమ్మ చనిపోయారు..." అన్నాడు రామమూర్తి.
"మీరు అంత్యక్రియలు చేశారా?"
"లేదు. నేను ఉత్తరాదిలో చాలా దూరంలో ఉన్నాను. నాకు ఆ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. మా తమ్ముడే అన్నీ చేసేశాడు" అన్నాడు రామమూర్తి.
పరమాచార్యులవారు, రామమూర్తికి ఐదు వేల రూపాయలు ఇవ్వమని మఠం సిబ్బందిని ఆజ్ఞాపించారు. పైగా కాంచీపురంలోనే అన్ని కర్మకాండలు చేయమని ఆయనకు సలహా ఇచ్చారు.
"కర్మకాండలు పూర్తి చేసి, ఆ తర్వాత దర్శనానికి రా," అని పరమాచార్య అన్నారు.
ఆయన అలాగే చేశారు.
అనంతరం ఆయన చాలా కాలం శ్రీమఠంలోనే ఉండి సేవ చేసి, తన ఎనభైవ ఏట శివసాయుజ్యం పొందారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి