మమ్ము మేము తెలుసుకొనే జ్ఞానాన్నిచ్చావు,
మా కాళ్ళపై మేము నిలబడే
సామర్థ్యాన్నిచ్చావు,
బ్రతుకుదెరువుకై మార్గాన్ని
చూపావు,
అమ్మ వలె కాచే నీవు,
జీవితానికి దారి పరిచావు,
నమ్మకాన్ని పెంచి పోషించావు,
నడిచే దేవత అయినావు,
చిరునవ్వుల పలకరింపులతో
చింతలు బాపేవు,
నీ సేవతో నీడలా ఉండేవు,
బాలికలకు విద్యే భవితగ చేసితివమ్మా
విలువలే వలువలుగా నేర్పుగ కట్టితివమ్మా
బతుకు బాటకు స్వయంఉపాధే చూపితివమ్మా
నర్సమ్మవు నీవై స్వస్థత చేకూర్చితివమ్మా
అహర్నిశలు అలుపు లేక
మంచిని నింపితివమ్మా
ప్రార్థనే నీ నిత్యకృత్యముగ
చేసిన నీకు స్తోత్రములు చేసెదమమ్మా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి