అందరం ఆకాశం కిందనే
పడుకుంటాం
నక్షత్రాలన్నీ ఆకాశం కిందనే
విచ్చుకుంటాయి
మేఘాల కిందనే
అన్ని పంటలు పండుతాయి!!
ఏరులన్నీ పారి పారి
నదుల్లోనే కలుస్తాయి
నదులన్నీ పారి పారి
సముద్రంలోనే కలుస్తాయి!!
భూమి పగిలి విత్తనాలన్నీ
మొలకెత్తుతాయి
ఉరుములు మెరుపుల్లోని
విద్యుత్తు పుడుతుంది.!!
కాంతి పగిలితేనే రంగులు ఏర్పడతాయి
రంగులన్నీ కలిస్తేనే ఇంద్రధనస్సు అవుతుంది
పచ్చని ఆకులతోనే ఎర్రని రక్తం ఏర్పడుతుంది
రక్తం రంగు మారితేనే పాలరంగు తెలుపు అవుతుంది.!!
రత్నాల రక్తంతోనే చెమట బిందువులు ఏర్పడతాయి
పౌరుషం రోషంతోనే మూతి మీసాలు నలుపు తెలుపు అవుతాయి.
పెదాల కలయికతోనే చిరునవ్వులు చిగురుస్తాయి
పూదోటల్లోనే
సీతాకో చీలికలు విరుస్తాయి
మాటల పంటల్లోనే
ముత్యాలు పండుతాయి.
తొలి పొద్దును మలి పొద్దును
స్వేచ్ఛ ముద్దాడుతుంది.
ఎగిరినా-గాలి బందీనే
ఎగిరిన కిరణం ఒక స్వేచ్ఛ పక్షి!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి