బంజారా బాహుబలి పోర్య తార.: - డా ప్రతాప్ కౌటిళ్యా.
నైలు నదిలా ఎదిగిన 
హరప్పా మొహంజదార 
నాగరికతల్లా ఒదిగిన 
బంజారా బాహుబలి ఆమె. 

ఇనుప సంకెళ్లు తెంచి 
బంగారు పంజరాన్ని తుంచి 
బంగారు పంటలు పండించి 
పంచి 
కీ కారాన్యాలు చీల్చి 
ఐరావతంలో ఘీంకరించి
మైదానాలు దాటి 
రహదారుల నిర్మించి 
రాయబారిగా నిలిచిన 
బంజారా రాణి ఆమె!!!.

కొండలు ఆమె గుండెలు 
మండే కాగడాలు ఆమె కళ్ళు 
నిప్పుల కొలిమి ఆమె వళ్లు
అరణ్యాలు ఆమె ఇల్లు 

పరుగెత్తే చిరుత ఆమె 
బంజారా చెలికత్తే ఆమె 
భారత చరిత్ర పుటల్లో
భారత చిత్రపటాల్లో మెరిసే 
నక్షత్రం ఆమె. 
ఉరిమే సింగం ఆమే
ఆమె పోర్య తార.......!!?
నవలా రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవర్ గారికి అభినందనలు. 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు