1.). గుండ్రంగా ఉంటాను
చేతి దెబ్బలు తింటాను
కూర నారతో నా దోస్తీ
మీ చేతికి రాగానే చస్తి !
2). నే గాలిని భోంచేస్తుంటా
మా బాగా గెంతుతు ఉంటా
దుమ్ము ధూళితో నా స్నేహం
ఎప్పుడు అడగను నే దాహం !
3). నాకున్నవి నాలుగు కాళ్లు
నా దేహం నిండా కళ్ళు
ఆ కాళ్లకు నలుచుట రాదు
ఈ కళ్ళకు మరి చూపే లేదు !
4). చంద్రునిలా నా ముఖము
తిరుగుటకు నే సుముఖము
నాకున్నవిలే రెక్కలు మూడు
మీటను నొక్కి నువ్వు చూడు !
5). ఎండకు వానకు మీ వెంట ఉంటా
నే లేకుంటే మీకు కలుగును తంటా
అసలు ఆ ఎండ వానాలు ఇక లేకుంటే
నే హాయిగా ఓ మూలన కూకుంటా ,!
6). నా తల పైనేమో టోపి
చేతుల మాత్రం లాఠీ
నా నోటితో వేస్తా సీటి
నేనెవరో చెప్పు స్వీటీ !
===========================
చెప్పుకోండి చూద్దాం జవాబులు
-------------------------------------------
1). రొట్టె. 2). బంతి. 3). నవార మంచం. 4). ఫ్యాన్. 5). గొడుగు.
6). పోలీస్.
చేతి దెబ్బలు తింటాను
కూర నారతో నా దోస్తీ
మీ చేతికి రాగానే చస్తి !
2). నే గాలిని భోంచేస్తుంటా
మా బాగా గెంతుతు ఉంటా
దుమ్ము ధూళితో నా స్నేహం
ఎప్పుడు అడగను నే దాహం !
3). నాకున్నవి నాలుగు కాళ్లు
నా దేహం నిండా కళ్ళు
ఆ కాళ్లకు నలుచుట రాదు
ఈ కళ్ళకు మరి చూపే లేదు !
4). చంద్రునిలా నా ముఖము
తిరుగుటకు నే సుముఖము
నాకున్నవిలే రెక్కలు మూడు
మీటను నొక్కి నువ్వు చూడు !
5). ఎండకు వానకు మీ వెంట ఉంటా
నే లేకుంటే మీకు కలుగును తంటా
అసలు ఆ ఎండ వానాలు ఇక లేకుంటే
నే హాయిగా ఓ మూలన కూకుంటా ,!
6). నా తల పైనేమో టోపి
చేతుల మాత్రం లాఠీ
నా నోటితో వేస్తా సీటి
నేనెవరో చెప్పు స్వీటీ !
===========================
చెప్పుకోండి చూద్దాం జవాబులు
-------------------------------------------
1). రొట్టె. 2). బంతి. 3). నవార మంచం. 4). ఫ్యాన్. 5). గొడుగు.
6). పోలీస్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి