తమ పాటలను ప్రజానీకానికి కానుకగా మంచి జ్ఞాపకాలుగా ఇచ్చి మన మధ్య నుంచి భౌతికంగా దూరమైన అందెశ్రీ గారి గురించి రెండు రోజుల క్రితం ఓ వ్యాసం చదివే భాగ్యం కలిగింది. ఈ వ్యాసం రచయిత శ్రీ రాఘవ గారు. ప్రెస్ క్లబ్ జర్నల్ అనే మ్యాగజైన్ లో వెలువడిన వ్యాసం ఇది. ఈ వ్యాసంతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి గాను. అందెశ్రీగారి అసలు పేరు ఎల్లయ్య.గారు.
అక్షరాలను పొందికగా పేర్చడంలో తనకంటూ ఓ పంధా ఉన్న వాగ్గేయకారుడు అందెశ్రీ గారు.
జీవితానుభవాన్నుంచి వచ్చిన అందెశ్రీగారి మాటలు పాటలను వింటూ లీనమైపోయే వారు రాఘవగారు.
ఏం చదువుకున్నారని అడిగితే
"నాల్గవతరగతి సదువుకున్న. చానా రోజులు పశుల మేపిన. గిప్పుడు ఇండ్లు కట్టే పనిలో మేస్త్రిగా ఉన్న" అంటూ ఏ మాత్రం భేషజాలకు పోకుండా తన గురించే చెప్పుకునే వారట అందెశ్రీ గారు.
చేతిలో తాపీని చూపించేవాడు.ఆ తాపీని ప్రశ్నలాగా నిలబెట్టేవాడు.
ఆయన రాసిన పాటలన్నీ కలిపి 'పాటల పూదోట'గా పుస్తకం వచ్చింది. దాంతో అందె ఎల్లయ్య కాస్తా అందెశ్రీగా మారిపోయారు. అదే పేరుతో ఖ్యాతి గడించారు. ఆ వెంటనే 'అందెల సందడి' పుస్తకమూ వచ్చింది.
ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ సభను శ్రీకృష్ణ దేవరాయ భాషాంధ్ర నిలయంలో 1995 జూన్ నెలలో ఏర్పాటు చేశారు. వేదికపైన సి.నారాయణ రెడ్డి, ప్రముఖ జర్నలిస్ట్ జి. కృష్ణ ఉన్నారు. వారి మధ్య అందెశ్రీగారు కూర్చున్నారు.
'అందెల సందడి' కి, 'పాటల పూదోట'కు ప్రముఖ జర్నలిస్ట్ జి. కృష్ణగారు రాసిన పరిచయ వాక్యాలు ఇలా ఉన్నాయి.....
"ఇది చదువు రాని వాడు వ్రాసే కవితలు. కవిత్వం రాని వాడు రాస్తున్న పరిచయం" అంటూ తాను రాసిన మాటలను సభలో గుర్తు చేసుకున్నారు కృష్ణగారు.
"అసలు చదువు రాని వాడు రాసే కవిత్వంలోనే నిజమూ, అమాయకత్వమూ సొంపుగా పెన వేసుకుని సాక్షాత్కరిస్తూ ఉంటాయి" అన్నారు కృష్ణగారు. సహజంగా వచ్చే ఈ కవితా శక్తిని ఏం పేరుతో పిలవాలి అని తనకు తానే ప్రశ్న వేసుకున్నారు."కవిత అనేది ఈ ప్రపంచాన్ని ఒక భావుకుడు విలక్షణమైన వింతగొల్పే అవగాహనతో చూసిన తీరు. అందరికీ చేతకాదు. పద్యం ద్వారా చూశాడా, పాట ద్వారా చూశాడా, గేయం ద్వారా చూశాడా అనేది అప్రస్తుతం. అతడు చూసిన తీరు మనలను చకితులను చేయాలంటారు జి. కృష్ణగారు.
"అందెశ్రీ ఈప్రపంచంలో ఎక్కడో ఇల్లు కడ్తూ, ఏదో అంతస్థు నుంచి తాపీని ప్రశ్నార్ధకంగానో, ఆశ్చర్యార్ధకంగానో పట్టుకుని పరికించుతూ గడపగలడు. అది అతడికి అలవడిన భావుకత. భావించగా భావించగా, అనుభూతి వల్లే పూచి, కాచి, పండిన భావుకత. 'నురపహతి' వగైరా అతడికి అందుబాటులో లేవనుకుంటాను. నిజానికి అవన్నీ ఉంటే సోమరి వలే సుఖిస్తాడు. అందెశ్రీకి ఇగ్లీషు రాదని చెప్పాడు. అందువలన ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు పడే పాట్లు పడనక్కర లేదు" అంటూ అందెశ్రీని జి. కృష్ణ ఆవిష్కరించిన తీరు ముదావహం.
సీనియర్ జర్నలిస్ట్ రావుగారి వల్ల అందెశ్రీ గారి పుస్తకాలు గురించి తెలిసాయి. ఇందుకాయనకు ధన్యవాదాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి