ఆపల్లెలో కాంతం భర్త అనే అతన్ని అంతా పిలుస్తారు.బ్రహ్మ మొక్కటే, అంతటా దైవం ఉన్నాడని ఎప్పుడూ దైవ స్మరణ చేస్తాడు.అమాయక చక్రవర్తి అని ,"భార్యాలోలుడని" అంతా మొహాన అంటున్నా కిమ్మన్నేవాడుకాదు. ఓ బంధువు ఇలా గేలిచేశాడు" ఏరా! భార్య అడుగుల కి మడుగులొత్తే వాజమ్మ! పేరు ప్రఖ్యాతులన్నీ ఆమెకు,వ్యవసాయం గొడ్డు చాకిరీ నీది.గ్రామ పంచాయతీ పనులన్నీ చక్కబెడ్తూ నిన్ను వెర్రివెధవను చేస్తోంది." దానికిఅతనిచ్చిన జవాబిది" అనాధనైన నన్ను ఆమె తండ్రి చేరదీశాడు.కాలు అవిటి ఉన్న ఆమెను ఎవరూ పెళ్లాడటానికి ఇష్ట పడలేదు.చావుబతుకులో ఆయన కోరిక మేరకు పెళ్లాడాను.ఆయన తృప్తిగా కన్ను మూశాడు.దివ్యాంగురాలైన ఆమెను ప్రోత్సాహించిన వాడిని నేను .కందకులేని దురద కత్తిపీటకెందుకు? చీపురుకట్ట ఊడ్చి శుభ్రంచేసి ఓమూల వదుగుతుంది నేను చీపురుకట్ట ని.మీలాంటి చెత్త చెదారంని దూరంచేయటానికే నేను దైవ స్మరణ చేస్తున్న. కబీర్ దాసు అన్నాడు కదా" మనల్ని విమర్శించేవారి దగ్గర ఉంటే మనలో దోషాల్ని వారు ఎత్తి చూపుతారు.మనం ఉత్తములుగా మారుతాం. అందుకే నీమాటలో మంచిని గ్రహించి చెడును వదిలేస్తున్నా".అంతే ఆ అహంకారి మొహం మాడింది🌹
సాధువు! -అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి