స్థానిక కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా ముందస్తూ సంక్రాంతి సంబరాలు జరిగాయి.
కార్యక్రమనికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ మేడం విజయ లక్ష్మి గారు అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి ప్రతి ఒక్కరు సిరి సంపదలతో, విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరారు, అందరికి మరియు దేశంలోని ప్రతి రైతుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.వివిధ పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేసారు. కార్యక్రమలో విద్యార్థులు,హరిదాసు వారి నృత్యలతో అందరిని అలరించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి