సీతాదేవి,గోదాదేవి
ఏదేవైనా భూదేవి
బిడ్డలైతే పుట్టుకతోపునీతులే.
నవజాత శిశువుఆడుకుంటూ ఉంటే పశు,పక్షి మృగాదు లతో.
వరప్రసాదమని
సమదికోత్సాహాన గిరిజనులు తెచ్చి పెంచి,పెట్టిరి పేరు సమ్మక్కని. ఇచ్చిరాపెకు నాయకత్వం. పగి డిద్దరాజు జంటకాగా ఆమె కడుపు పంటగ ఆమె ఇంట వెలసేరి
సారక్క నాగులక్క జంపన్న.
కాకతీయ రాజ్యమదపాంశువు రిక్తములను సతమతము జేసే
అధిక పన్నుల. . నెదిరించి సమ్మక్క సంసారం సమసిపోయిరి సమరమందు
తనవారు రణములోతనువులు చారించగా
వచ్చింది ఆదిశక్తి
సమ్మక్క రూపమై.
రణ రంగమది
రక్తాగ్ని గుండమైపోగా
కాకతీయ రాజు
కన్నులవి చూచే
సమ్మక్క శౌర్యము
విస్మయమున.
రాజు
వీక్షించునంతలో
చాటు మాటుగా తనవారు వేసిన బాణాహతికి సమ్మక్క కూలే.
కొండపగిది.
లేచి
జన్మచాలించు సమ్మక్కసాగిపోయే చిలకల గుట్ట వైపు. వెలసిందచట సిందూరపు
భరిణయై తన గుర్తుగా.
సమ్మక్క సమజ్ఞ
ఎర్రని కుంకుమందు కుదురుకునియే
దైవ శక్తి ముందు రాజ్యశక్తి తలవంచే ప్రతాపరుద్ర ప్రభువుసమ్మక్కకు పాదాక్రాంతుడైయ్యే.
పన్నులు రద్దుచేసి
సమ్మక్క సారక్క జాతరకు జెండా పాతే ప్రతాపరుద్రుడు.
అదే మేడారం జాతర.
విగ్రహాలు లేవు
అలంకరణలు సున్న ఆడంబరాలు, ఆర్థికపరమైన కానుకలు లేని నిరాడంబర పూజ మేడారం జాతర.
ఎదురు గడలు
కుంకుమభరిణలై
రూపు దాల్చి అందుకొను పూజలు ప్రజల నుండి.
ఈ క్షేత్రం,
అది తెలంగాణ
ములుగు జిల్లా
తాడ్వాయిమండలం
ఏటూరు నాగారం
మేడారం గ్రామంఉంది అభయారణ్యంలో
అద్భుత జన సందోహం, ఈ జాతరకు తరలివచ్చు.
ఆసియా లోనే పెద్ద పండగ, కుంభమేళాతదుపరి కోరి భజించదగ్గజాతర.
మాఘశుద్ధ పౌర్ణమి మొదలు నాలుగు రోజులు
అడవులు అమ్మ పూజలో ఆనందపు అంచులు చూచే
వెన్నెల
రోగాలు వదిలించేది సమ్మక్క చేతి మందు, అందుకే ఆమె కోరింది బెల్లం విందు. ఉంది, అందులో ఆరోగ్యపు తీపి.
సంపెంగ వాగులో జంపన్న ఆత్మార్ప
ణానంతరం
అది జంపన్నవాగు గా ప్రసిద్ధం.
అందలి నీరు రక్త వర్ణం అది జంపన్న రక్తమని పవిత్రమని ప్రజలు
ఆచరిస్తారు
అందులో స్నానం.
జాతర సమాప్తి
కుంకుమ భరిణలు గద్దెలు దిగి తమ గమ్యం వైపు పయనంతో
ఓ కమ్మని కార్యం
సమాప్తం.అశేష జన వాహినికి
మిగులుతుంది సంతోషం.🪸
2014
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే మేడారం జాతర తెలంగాణ రాష్ట్ర పబ్బంగా.
ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని యుగాలు గడిచిన
అడవి బిడ్డల
ఆదర్శాలు ఆప్యాయతలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి