నాన్న : ..కోరాడనరసింహా రావు!
నవమాసాలు మోసి , ప్రాణాలకు తెగించి, కని, పెంచేది  అమ్మే...! 
  ఐనా... మన జన్మ కు మూల కారకుడైన నాన్నను పక్కన పెట్టేస్తే... ఎ లా...!? 
      క్షేత్ర మెంత  సార వంత మైనదైనా.... 
    బీజం వెయ్యనిదే... 
 పంట పండదుగా....! 
 కేవలం తండ్రిది బీజమేనా
 బాధ్యతో...?! 
   తల్లి నవమాసాలు తన గర్భంలో  మోస్తే... 
  తండ్రి మనను  మనం ప్రయోజకులమయేవరకు... 
బాధ్యతల బరువును తన భుజాలపై  , మోస్తునే ఉంటాడు...! 
  తనలా తన పిల్లలు కష్టాలు పడ కూడాదని
అహరహమూ పరితపిస్తా డు...! 

మనం ఏ మి సాధించినా        సంతోషించేది
  కల్మషమ్లేకుండాసంతోషిం చేది మొదట కన్న తండ్రే...!తరువాతే తల్లి!! 
    మనం తల్లికి యిచ్చిన గుర్తింపు, గౌరవం తండ్రికి ఇవ్వము...! 
  తల్లి లా... తండ్రి ప్రేమ ప్రత్యక్ష0 కాదు...! 
  తండ్రిది పరోక్ష ప్రేమ!! 
  మన బాగు కోసం మనతో తండ్రి కటువు గా  ప్రవర్తించటం మూలాన... 
  మనకు తండ్రి అంటె కాస్త భయమే గాని,అంతగా ప్రేమ పుట్టదు...!! 
    ఐనా... తండ్రికి పిల్లల పై అపార మైన ప్రేమ...! 
  కనుకనే మనం... గొప్ప వారిగా ఎదిగి, సుఖ పడ గలుగు తున్నాము...!! 
  పితృదేవో భవ 💐🙏🌷
******


కామెంట్‌లు