తుషార శీతల పవనాలకు ఊగే
కొమ్మలు ముంగురులై తోచగా
ఉషా సుందరి పాపిట బొట్టులా
ఉదయించే అరుణబింబ తేజస్సుకు
నిలిచి చూసే నింగిమోమున
మెరిసే రంగుల విన్యాసానికి
ఎర్రబడ్డ ఆకాశం వెలుగులకు
బెదరి పరుగుతీసే తిమిరం
గరిక పువ్వులపై నిలిచి
దినకరుడికై దారికాచి
కిరణాలు సోకగానే కరిగి
నీరయ్యే తుహిన బిందువు
వెన్ను నిమిరే నులివెచ్చని
కన్నతండ్రి స్పర్శ ఆస్వాదిస్తూ..
అత్తింటికి తరలి వెళ్లే కూతురిలా
తిరిగి చూస్తూ సాగుతున్న సెలయేరు
దోసిట నీరు నింపి ధారగా
చేసే నివేదనలు ఆలించాలని
సర్వ జీవుల రక్షకుని రాకకు
స్వాగతం పలికే పెదవులకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి