ఎరావన్ ఏనుగు!- సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 బ్యాంకాక్ బ్రహ్మ తర్వాత ప్రసిద్ధిగాంచిన ఎరావన్ కొయ్య ఏనుగు తమకు అదృష్టం సౌభాగ్యం తెస్తుందని ప్రజల నమ్మకం.అందుకే ఆబొమ్మని తమ ఇంట ఉంచి బంతిపూలతో పూజిస్తారు.వారి కోరిక తీరాక ఆగుడికి వచ్చి అక్కడ ఉండే నర్తకీమణుల చేత పాటలు పాడించుకుని ఆనందిస్తారు.ప్రతిరోజు తైవాన్,సింగపూర్ హాంగ్ కాంగ్ నుంచి వందలాది యాత్రికులొస్తారు. హిందూధర్మాన్ని బ్రాహ్మణ వాద్  అని థాయ్ వాసులు పిలుస్తారు.బ్రహ్మ ధర్మం అని వారి భావన. వేలాది ఏళ్లక్రితమే హిందూ మతం అక్కడ విరాజిల్లింది. చోళ గంగ రాజుల కాలంలో మనదేశ వ్యాపారులు,శిల్పులు కళాకారులుఆప్రాంతంలో స్థిరపడ్డారు.థాయిలాండ్ కి సువర్ణ భూమి అనిపేరు.శ్రీమహావిష్ణువు అక్కడి రాజకుటుంబాలకు ఇలవేల్పు ఇష్టమైన దైవం.బ్రహ్మ పూజారులకు కులదైవం.గర్భవతికావాలనే కోరిక తో మహిళలు శివుని ఆరాధించేవారు. మనదేవదాసీ ఆచారం,గుడిలో నాట్యం మనదేశంలో మాయమైనా థాయిలాండ్ లో ఆలయనర్తకీమణులున్నారు ఇప్పటికీ! అందుకే వారు ఆరాధించే బ్రహ్మ మన ఇంద్రునితోసమానమైనవాడు. మన బ్రహ్మ దేవుడి వాహనం హంస ఐతే అక్కడ ఏనుగు.ధర్మం సమయం ప్రాంతాలకు తగినట్లు మారుతూ ఉంటుంది.ఏదేమైనా మన భారతీయ సంస్కృతి ఇలా పరివ్యాప్తం కావటం.చరిత్ర లో నిలవటం ముదావహం 🌹
కామెంట్‌లు