సామెత -119- అజ్ఞానితో సోపతి కంటే విజ్ఞానితో విరోధం మంచిది
****
"ఒరే వారీ!ఇంకోపాలి వానితో తిరిగినవంటే కాళ్ళిరిగ్గొట్టి ఇంట్లె కూసబెడ్త.ఎన్ని త్యేపలు శిలక్కి జెప్పినట్టు చెప్పినా నీకు శెవి మీద పేను బారినట్టు లేదు."
"సూడవ్వా!నువ్వన్న జెప్పు. గీ పోరడు అరికీసు ఇంటల్లేడు. పొద్దుగాల లేశిన కానించి పక్క ఎక్కేదనుక గా గణేష్ పోరని సుట్టూ కుక్కపిల్ల లెక్క తోకూపుకుంట తిర్గుతుండవ్వా!"
"నియ్యవ్వ! తిర్గితే ఏమైతదే! గాడు శాన మంచోడు.గాంతోటి తిర్గొద్దని శెవిల జొర్రీగలెక్కన ఒకటే వొర్రుతున్నవు."
ఇగ జూష్నవా అవ్వా! పోరడు పెద్ద పెద్ద మాటలెట్లంటుండో! ఎట్ల మర్లె బడుతుండో "ఒరేయ్ ! గా బుడ్డోడు, భూలచ్మి ని సూడరా సూడు! సక్లెం ముక్లం బెట్టుకొని ఎంత ముద్దుగా సద్వకుంటున్నరో? పిల్లగాండ్లంటె గట్లుండాలె."
"ఏందిరా అయ్యా! అమ్మ నాయిన మాటల్ని శెవిన బెట్టకుండ ఎకరదిత్తున్నవట.ఏంది సంగతి? తెలివి తక్కువోనితో సోపతి శెయ్యొద్దు.గాళ్ళు మూర్ఖంగ ఆలోచిత్తరు. గస్మంటి కతోటి శెప్త.నీకు కతలంటే ఇట్టమేనా?"
"నాకు మస్తు ఇట్టం అవ్వా! శాన్నాల్లయింది శెప్పు శెప్పు. భూలచ్మి, బుడ్డోడు అంటుంటే , గాళ్ళతో కలిపి ఇట్టమని రమేష్ సుత తల్కాయ ఊపిండు.
" అనగనగా ఒక అడవి.అందులో ఒక కోతి శెరువు పక్కనే ఉన్న గిన్నె పండ్ల శెట్టు మీద ఉండేది. మంచిగా పండ్లు రాల్పుకుని తిని శెర్వుల నీళ్ళు తాగేది. గదంత శెర్వులున్న మొసలి జూసింది. ఓరోజు కోతి నీళ్లు తాగుతుంటే 'నీతో సోపతి చెయ్యొచ్చా? అడుగుతుంటే కోతి సరేనంది.
గట్ల గవి రెండు దోత్తులైనవి.అప్పుడప్పుడు గిన్నె పండ్లు మొసలికి పెట్టేది.గవీటిని ఓ నాడు మొసలి తన పెళ్ళానికి తీసుకుని పోతాడు.గవిషతిన్న ఆడ మొసలి. గివే గింత రుషిగున్నయి. గివి దిన్న కోతి ఇంకెంత రుషిగ ఉంటుందో! దాన్ని పట్కరమ్మని మొగని మొసలికి శెప్పుకుంట గీ యిషయం తెలిత్తె రాదు. కోతికి భార్య ఇల్లు సూత్తానికి రమ్మనమని శెప్పి పట్కరమ్మంటుంది"
'గట్లనే' అని కోతికి తనిల్లు సూపిత్తనని కొంట బోతూ నడిమిట్లకు రాంగనే మాటల మద్ధెల జెబుతుంది.
గదిని కోతికి గుండె జల్లుమంటుంది.ఎంటనే తెలివిగా "అయ్యో! నా గుండె కాయ శెట్టు తొర్రల దాశొచ్చిన. తెత్త మరి అంటుంటే."అవునా! మళ్ళ ఎనక్కి బోదాం"అని ఒడ్డుకు తీస్కొత్తది. అక్కడ నుంచి ఒక్క దూకుతో ఒడ్డెక్కుతుంది కోతి.
" మొసలితో "గుండెకాయ ఎవలన్న బైట దాస్కొని ఒత్తరా? నీలాంటి అజ్ఞానితో సోపతి చేడం వల్ల ఎంత పెమాదమో తెల్సి వొచ్చింది. అన్కుంట శెట్టెక్కింది.
గదర్రా కత. మొసలి లాంటి తెలివి తక్కువోళ్ళతో సోపతి శేయడం కోతి పానానికే ముప్పు వొచ్చింది. మనం కోతిలాంటోనితో పంచాయితీ పెట్టుకున్నా సరే గానీ...
మొసలి లాంటి తెలివి తక్కువోడితో కలిసి ఉండవద్దు .శత్రువైనా సరే. గాళ్ళని గమనిత్తే తెలివి తేటలు వత్తయి. అందుకే మనోళ్ళు తెలివి తక్కువ వాళ్ళతో సోపతి శేయొద్దు అంటరు.సమజైందా? గిండ్ల ఎవలిది తెలివో?. ఎవలు తెలివి తక్కువనో మనకు అర్తం అయ్యింది కద!మనం కోతి అస్మంటి విజ్జానులతో సోపతి చేయాలె, ఒకవేళ శత్రువైన సుత దానిని గమనించాలి"అర్తమైందా? అనంగనే పిల్లలు ముగ్గురు అయ్యిందంటూ తలకాయలు ఊపిండ్రు.
గదండీ సంగతి " తెలివి తక్కువ వ్యక్తితో సోపతి కంటే అనగా"అజ్జానితో సోపతి కంటే తెలివైన వ్యక్తితో విరోధం మేలు అంటరు'

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి