బంధాలకి బంధనాలు తోడై
అడుగుల దూరం ఆమడలై
మనుషుల మధ్య రేగిన
మాటల కణికలు మంటలై
మదినంతా మాడ్చేసాయి
కణ కణము కాలుతూ
ఎగిరే రేణువులే ఎదనిండా
రుద్ధిరపు ముద్దలే తనువంతా
భారంతో కూడిన నా
చూపు లిపిని చదివాయేమో
చిన్నారుల కన్నులు ఆ
భాష తెలిఫైనా పెదాల వెంట
చిరు నవ్వుల చినుకులు కురిసి
మనసు చిచ్చుని అర్పేసాయి
మమతని మళ్ళీ పెంచేసాయి
అనురాగాన్ని నింపేసాయి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి