పుడమి చేసిన పుణ్యమేమో
ముసిరిన మబ్బుల విసరికొట్టి
కొసరిన ధరణికి కానుకగా
పొగడకనే కురిసిన కనక ధారగా
నింగిని పొంగిన కాంచన గంగకు
నేలను చేరే కోరిక తీరంగా
కదలి సాగెను వేగమే
కణకణమూ కాంతులు ప్రవహించగా..
వింతను చూసి వనమంతా
సంతసముగ తన శాఖలనూపి
గలగలమని సవ్వడి చేస్తూ
కరతాళధ్వని చేసె ప్రియముగా...
వేడగనే దొరకవు వరములు
కూడాలి కాలపు లెక్కలు
వీడాలి కలతల మబ్బులు
చూడాలి బంగరు వెలుగులు
ఓర్పు సహనం పడుగు పేకగా
తీర్పుగా విజయం వరించగా
కూర్పుగా నేసిన సరికొత్త చీరకు
నేర్పుగా జిలుగులు దిద్దే తీరుగా..
నోచిన నోముల పున్నెము పండి
వేచిన మదిలో వెన్నెల కాయగా
కాచిన కన్నుల మెరుపులు నింపి
తోచిన కరుణను గుమ్మరించే వేకువ రాగా
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి