అందని ఆనందాన్ని
గుండెలో దాచుకుని
అపురూపంగా భావించి
తలచి తలచి మురిసే
తరుణి మదిని పోలి.....
అందమైన తలపుల
అర్ణవమైన హృదిని
ఆకాశంలలో విహరింపచేసి
ఆనందపడే మనసులా...
నింగిని చిందిన బంగరు కాంతులు
ముంగిలిలో రంగులు నింపి
మంగళకరమైన ముగ్గులేసి
పండుగ చేసిన ఆనందంలా....
వాకిట పూచిన సుమాలు
దోసిట నింపి నిలిచి
చీకటి తొలగే తరుణం కోసం
వేచిన ఎడదకు వేకువలా...
వచ్చే పండుగ ఆనందం
తెచ్చే జీవన మకరందంతో
విచ్చే బ్రతుకుల దారిలో
వెలిగే ఆశల దీపంలా....తోచే
కొత్త వెలుగుల ఉదయానికి
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి