ఓటమెరుగని ఓర్పే ఆయుధం
అలుపెరగని నడకే యుద్ధం
పడిపోయే కెరటం కాదు
పడిలేచే గుణం చూడు
కమ్ముకున్న చీకటి కాదు
నమ్ముకున్న వెలుగు ముఖ్యం
సమస్యలతో సతమతమైనా
సహనంతో సహగమనం మిన్న
కోరినవన్నీ దొరకవు
దొరికినవే కాపాడుకోవాలి
వేదన మనతో ఉండిపోదు
వేడుక మనకై ఆగిపోదు
సొంతం ఏది కాదు అనుకుంటే
స్వర్గం నీదే అవుతుంది
మనసును కష్టపెడితే
మనుగడ మారిపోదు
మొదలెక్కడో తెలియదు
ముగింపు తెలిసే అవకాశం లేదు
చిక్కులు చుట్టేస్తుంటే
మొక్కులు కాపాడవు
దిక్కులు తోచని దూరంలో
అక్కున చేర్చే వారే దైవం
నీదంటూ కాని బంధం
నీతొనే ఉండదు నిత్యం
కను తెరచిన మెలకువలో
కనిపించే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి