బ్రతకడం అంటే?!
తాను బ్రతుకుతూ పదుగురికి బ్రతుకు నివ్వడం
ఆత్మవిశ్వాసంతో
అలుపెరుగని జీవన పోరాటం చేయడం
అంతేకాని
మాయా మోసం కుట్ర
కుతంత్రంతో
పైకొకటి లోనమరొకటిగా
జీవించడం కాదు
తప్పుడు గా జీవించడం ఆత్మద్రోహసదృశ్యమేకదా!
కలికాలంలో అధర్మమే వర్థిల్లుతుందని నీతి సూత్రాలు వల్లె వేయడం కాదు
కాలమేదైనా సాటి మనుషుల పట్ల దయార్ద్ర హృదయం కల్గి యుండడం
ఆపన్నలకు అండగా,
దీనులకు కొండంత భరోసాగా
జీవించడం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి