ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తగా గద్వాల సోమన్న

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న గుంటూరులో  ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షులు  డా.గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో  జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తగా"బాలసాహిత్యంలో గేయ సాహిత్యం విశిష్టిత" అనే అంశంపై మాట్లాడారు.ప్రతిష్టాత్మకమైన ఈ సభలో పిల్లలకు గేయ సాహిత్యం యొక్క అవశ్యకత,రచనలో మెళకువలు వివరించారు.అనంతరం వారు వ్రాసిన 89వ పుస్తకం "ఆమని కోయిల" పుస్తకావిష్కరణ సహస్ర గురు అవధాని కడిమెళ్ల వర ప్రసాద్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతులు dasari వెంకటరమణ, పత్తిపాక మోహన్, చదువులబాబు, పెన్మేస్ససత్యనారాయణ, ధవేజీ ప్రముఖుల చేతుల మీద జరిగింది.బహు వక్త,గ్రంథకర్త గద్వాల సోమన్నను సత్కరించారు.
కామెంట్‌లు