పుత్రుడు (కానరాని లోకాలకు): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ
పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పిస్తాడనుకొన్న తల్లిదండ్రులు 

వాహనప్రమాదంలో కాలం చేస్తే...
కొడుకుపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెంచుకున్న తల్లిదండ్రులు కంటికి పుట్టెడు దుఃఖం 

ఎవరూ తేగలరు పోయిన ప్రాణాలు

ఎవరూ చూడగలరు 
రెండో బాల్యంలోకి పొడచూపుతున్న 
ఆ తల్లిదండ్రుల యోగక్షేమాలు

చెట్టంత కొడుకు చేదోడువాదోడుగా 
ఉంటాడనుకుంటే తండ్రే తలకొరివి పెట్టవలసివచ్చేగదా!

ఒక్కగానొక్క కొడుకు 
మరల రాని లోకానికెళ్తే
గుండెలవిసేలా రోదించే
 ఆ తల్లిదండ్రులను ఓదార్చువారెవరు?!

కాలానికి జాలేలేదు
దైవానికి దయార్ద్ర హృదయమేలేదు
తల్లిదండ్రులను దిక్కులేని పక్షులచేసి దైవం పాపమే మూటకట్టుకొనెగదా!?

హే భగవాన్ !?
ఎందుకయ్యా ముందు రత్నం లాంటి కొడుకునిచ్చి
యుక్త వయస్సులోనే అర్థాయుష్ష్కుడిగా నీ చెంతకు తీసుకెళ్ళావే
లేకలేక కల్గిన నా ఏకైక సంతానం 
నా కొడుకు 
గ్రద్ద కోడి పిల్లను ఎగరేసుకెళ్ళినట్టు మాకు చెప్పపెట్టకుండా 
వెంట తీసుకొని వెళ్ళడం 
నీకు భావ్యమా తండ్రి


కామెంట్‌లు