పుస్తక పఠనం ద్వారానే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి.ఉమ పేర్కొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అలూమ్ని క్లబ్ ఆధ్వర్యంలో నాన్నారం కధైగల్ చిన్నపిల్లల తమిళ పుస్తకాన్ని శనివారం[31/01/2026] తన చాంబర్ లో ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలతో కూర్చున్న చోటే వేలాది పుస్తకాలను చదివే అవకాశం ఉందని చెప్పారు. దాంతో పుస్తకాలు చదివే వారు తగ్గారని, లక్షలాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న లైబ్రరీలకు ఎవరు వెళ్లి చదువుకోవడం లేదని తెలిపారు.చిన్నారులు తప్పకుండా లైబ్రరీకి వెళ్లి చదివే అలవాటును తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. నాన్నారం కథైగళ్ రచయిత బొల్లి రామస్వామి రఘుపతి పుస్తక పరిచయం చేశారు. ఆర్ సి కృష్ణస్వామి రాజు తెలుగులో రాసిన నాన్నారం కథలు పుస్తకాన్ని తమిళంలోకి అనువదించినట్లు చెప్పారు. చిన్నారుల్లో తమ కుటుంబం, సమాజం, దేశం పట్ల సరైన అవగాహన పెంపొందేందుకు ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. కృష్ణస్వామి రాజు మాట్లాడుతూ పుట్టి పెరిగిన ప్రాంతం,అక్కడి భాష, అలవాట్లు, పరిసరాల ప్రభావం ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. పుస్తక రచయితలను వీసీ ఘనంగా సత్కరించి అభినందించారు. కవి, విమర్శకుడు డాక్టర్ గాలి గుణశేఖర్, పుత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ తమిళ విభాగం లెక్చరర్ డాక్టర్ పి. అమ్ము దేవి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సాహితీ ప్రియులు డాక్టర్ మౌని, ఏనుగు అంకమ నాయుడు, రామిరెడ్డి, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అలూమ్ని సభ్యులు కృష్ణమూర్తి, రమణన్,శంకర్, శ్రీనివాసరావు, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనం ద్వారానే వ్యక్తిత్వ వికాసం: - మహిళా వర్సిటీ వీసీ ఆచార్య వి. ఉమ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి