భారతదేశ రాష్ట్రపతులు- బాబూ రాజేంద్రప్రసాద్: - అచ్యుతుని రాజ్యశ్రీ
 బీహార్ లోని జిరాదెయీ అనే గ్రామంలో1884లోరాజేంద్రప్రసాద్ పుట్టారు.తాత దివాన్ కావటంతో బాల్యంలో డబ్బుకు లోటులేదు. తల్లి కమలేశ్వరీదేవి,తండ్రిమహాదేవ్ సహాయ్. వారికి 5గురు పిల్లలు.ముగ్గురు ఆడ,ఇద్దరు మగపిల్లలు. రాజేంద్ర బాబు ఆఖరివాడు.అక్కభగవతీదేవి వితంతువు.26జనవరి1956లో ఆమె తమ్ముడు ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దగ్గరే తనువు చాలించింది.కానీ రిపబ్లిక్ డే కావటంతోవిజయపథ్ లోసైనికవందనం స్వీకరించిన ఆయన అక్కకి దహనసంస్కారంచేశారు.1962 లో రాష్ట్రపతి పదవీకాలం
 ముగిశాక పట్నా సదాకత్ 
 ఆశ్రమంలో ఉన్నారు.1962 లోడిసెంబర్లో భార్య రాజవంశీదేవి మరణంతో కృంగిపోయారు. బాగా డీలాపడ్డారు.28ఫిబ్రవరి1963లో ఆయన సదాకత్ ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు12వ ఏట ఆమెతో పెళ్లిజరిగినప్పుడు తన అనుభవాల్ని చెప్పారు"జీరాదెయీ నుంచి మగపెళ్లివారం బైలుదేరాం. మాంఛి ఎండాకాలం! నాపల్లకీకి పైన ఆచ్ఛాదనలేదు. ఎండకి వాడి వడిలిపోయాను. రాత్రి పల్లకీలో నిద్ర పోయాను. వధువు ఊరు చేరాం .అలసిననాదేహం నిద్రమత్తులోనే పెళ్లితంతుముగించాను.నాకేమీ గుర్తులేదు." ఆయన 23వ ఏట తండ్రి చనిపోటం,అన్న మహదేవప్రసాద్ సాయంతో ఎం.ఎల్.కూడా పాసైకలకత్తాహైకోర్టులో వకీలుగా మంచిపేరు పొందారు.బాల్యం నుంచీ మేధావి ఐన రాజన్ బాబు స్కాలర్షిప్స్ తో చదివారు.ఆరోజుల్లో బిహార్ ఒడిషా బెంగాల్ అస్సాం బర్మా నేపాల్ స్కూల్స్ కలకత్తాయూనివర్శిటీకి అనుబంధంగా ఉండేవి.అన్నిటా ఆయన టాప్ లో నిలిచి 20,10 రూపాయల స్కాలర్షిప్స్ తోఎఫ్.ఎ.ప్రథమ శ్రేణిలో పాసైనారు .ఐ.సి.ఎస్.కి ఇంగ్లాండ్ కి వెళ్లమని అంతాప్రోత్సహించారు.కానీ తండ్రి చావుబ్రతుకుల్లో ఉండటం ఇంట్లోవారు ఒప్పుకోకపోటంతో ఎం.ఎ.చదివారు.ట్యూషన్స్ స్కాలర్ షిప్స్ తో ఆయన చదువుకున్నారు.తండ్రి చనిపోటంతో అన్నకి భారం కారాదని స్వయంకృషితో ఎదిగిన భారతీయ సనాతన రాజర్షి గా పేరుగాంచిన ఆయన బిహార్ బెంగాల్ వరదలప్పుడు, భూకంపం వచ్చినపుడు ఆయన చేసిన సేవలు 38లక్షలు  
 విరాళాలుసేకరించటం బాధితులకు అందజేయటంలో ఆయన అందరికీ ఆదర్శ నేతగా నిల్చిపోయారు🌷

కామెంట్‌లు