ఆరోగ్యంతో ఆటలు వద్దు!
కాపాడుకుంటే ఎంతో ముద్దు!
నిత్యం వ్యాయామం ఉదయం...
ఇచ్చు మనిషికి దృఢత్వం!
ఒక గంట పాటు నడిచావంటే...
చెమట పట్టును శరీరం!
గుండె వేగం పెరిగేను!
ఆకలి దప్పులు మెరుగై,
అజీర్ణ రోగాలు పరిగెత్తు!
సైకిల్ తొక్కిన తయారగు...
కాలి పిక్కలు, నడుము దృఢం గా!
ఈతలో కాళ్లు చేతులు చురుకై,
శ్వాసక్రియ మెరుగుపడు!
యోగ, ప్రాణాయామ, ధ్యానాలు...
నిలుపు మనిషిని చురుగ్గా!
చిరుధాన్యాలు తిను.. పిజ్జాలు మాను!
మితాహార భోజన స్వీకారం...
సాత్విక, సమతుల ఆహార గ్రహణం,
అతిధితిండి, అతి నిద్ర మానడం,
ఆ తిండి కరిగేందుకై చేయి...
జాగింగ్,స్కిప్పింగ్, డాన్సింగ్!
త్వరగా మేల్కొని, వేగంగా నిద్రపో!
నియమబధ్ధంగా నీరు త్రాగు...
కనీసం రోజుకు మూడు లీటర్లు!
వృద్ధులకు అవసరం రోజూ ...
కంటి నిండా నిద్ర, వ్యాయామం!
అప్పుడే ఉండు బ్యాంకులో డబ్బులా...
మీ ఆరోగ్యం మీ చేతిలో!
ఇది ఆరోగ్యమే మహాభాగ్యం కదా!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి