శేషేంద్ర , ఇందిర: - సేకరణ -తాయారు
శ్రీ గుంటూరి శేషేంద్రశర్మగారు..
రాణి ఇందిరాధనరాజ్ గిర్
వీరితో నా కుటుంబానికి సాన్నిహిత్యం..
కొంత మేర మీరినదనే ..
వారి దగ్గర నా కెంతో చనవు..
చాలసార్లే వారి జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ కు వెళ్లాను..
మాశర్మగారన్నట్లు ..
వారి ఆతిథ్యమాధుర్యం బాగానే చవి చూసిన వాడిని..
ఇద్దరికీ మేమంటే వాత్సల్యం..

వారు.. 
"చమత్కారికలు"
అన్న శీర్షికతో లఘుకవితలు
వినిపించేవారు..
అయితే వాటికి ఎందుకో ప్రచారం రాలేదు..

ముఖ్యంగా శ్రీ శేషేంద్రశర్మగారికి..
సాహిత్యబాంధవ్యం ఒక కారణమైతే..
మరొక కారణం..
వారొ ఒకప్పుడు కమిషనర్ గా పనిచేసిన
గూడూరు మునిసిపల్ ఆఫీసు..
(అప్పుడే వారు ఋతుఘోష వ్రాశారు..గూడూరు మైకా శ్రీమంతుడు పొన్నలూరి కోటారెడ్డిగారికి అంకితమిచ్చారు.. )
ఆ గూడూరు మునిసిపల్ కమిషనర్ గానే
మా నాన్నగారు పనిచేసినవారు..
అ 'ఉద్యోగ సతీర్త్యత' - అదీ కారణం కావచ్చు..
ఏదేమైనా ఇద్దరూ ఆదర్శమూర్తులు..

వారు ముంబయి వచ్చినప్పుడు..
సమావేశంలో.. అప్పుడు శ్రీశేషేంద్రశర్మగారు
సీరియల్ గా వ్రాసిన 'కామోత్సవ్' ప్రసక్తి..
అది వారిదగ్గరలేదు.. ఆ వ్రాతప్రతులేమయ్యాయో..
కానీ.. ఆ సమయానికి వారపత్రికలో
సీరియల్ గా వస్తున్న ఆ నవలను
నేను వారం..వారం.. కత్తిరించి దాచి ఉంచాను..
ఆ విషయం వారికి చెప్తే..
శ్రీమతి ఇందిరాధన్ రాజ్ గిర్ గారు
పసిపిల్లలాగే ఆనందం ..

కారణం.. ఆ నవలలో వచ్చిన
సాహిత్యం..ముషాయిరాలు..
అవన్నీ వీరి జీవితంలో వాస్తవాలు..

ఆ తర్వాత అది నేను వారికిచ్చాను..
అది నవలగా వచ్చింది..

ఎన్నెన్నో జ్ఞాపకాలు..
వాటిని తడుముకొనే అవకాశం
కల్పించిన మాశర్మగారికి నెనరులు..

కామోత్సవ్ నవలలో వారుదాహరించినది..
వారికెంతెంతో ఇష్టమైనది..
నా కంతకంటే ఇష్టమైనది..
ఎన్నిసార్లో అనుకుని..అనుకుని..
ఆ గీతంతో స్వస్తి..

హమారా దిల్ సవేరాకా
సున్హేరా జాం హోజాయే
చరాగోంకీ తర్హా ఆంఖే
జలే జబ్ ష్యాం హో జాయే

ఎ ముఠ్ఠీభర్ ఉమర్ ఇక్ దిన్
సమందర్ బస్ గరజ్నేదో
హవాయే తేజ్ హా ఔర్

కష్తియోఁ మే ష్యాం హోజాయే

ఉజాలే అప్నె యాదోంకీ
హమారా సాత్ రహ్ నే దో
న జానే కబ్ హమారీ 
జిందగీకీ ష్యాం హోజాయేగీ

_సాంప్రతి సురేంద్రనాథ్


కామెంట్‌లు