మిడత ఉసరవెల్లి. :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
కంది చెట్టు మీద ఉందమ్మా 
అందాల బొమ్మ ఒకటి 
దాని రంగు చూడరమ్మ 
అందమైన ఆకుపచ్చ రంగు 

అది ఆకు మీద వాలింది 
అటూ ఇటూ చూస్తుంది 
దాని పేరు వింటారా 
ఆకు మిడత అంటారు 

వేరే ఆకు మీద వాలితే 
ఆ ఆకులా మారుతుంది 
దానికి ఇంకో పేరు ఉంది 
ఆకు ఊసరవెల్లి అంటారు 

ఇప్పుడది శాస్త్రీయ నామం 
పూర్వం పెద్దలు దాన్ని 
గడ్డి చిలుక అంటారు 
ఎన్నో రకాల ఉంటాయవీ 


కామెంట్‌లు