విశాఖపట్నం లో రాజేంద్రనగర్ లోని ప్రిజం కళాశాలలో ప్రముఖ సాహితీ సంస్థ సహృదయ సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన కవి సమ్మేళనంలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ సమాజ హితమే సాహిత్యంగా వ్రాసిన రచనలు అభివృద్ధికి తోడ్పడతాయని 'ఆత్మహత్యలకు కారణమెవరు? అని నేటి సమాజంలో పాఠశాల పిల్లలు యువత అన్ని వయస్సుల వారు చిన్న చిన్న సంఘటనలకే ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం అని తన కవిత ద్వారా చెప్పారు.వ్యవస్థాపకులు శేఖరమంత్రి ప్రభాకర్ గారు, కార్యదర్శి ప్రముఖ రచయిత డాక్టర్ కె. జి.వేణు ,ముఖ్యఅతిధి ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య దామెర వెంకట సూర్యారావు గారు ప్రసాద్ మాష్టారును అభినందించారు. సరస్వతీ సభలో కవులు చిన సూర్యనారాయణ, భాగవతుల సత్యనారాయణ మూర్తి, ఉప్పల అప్పలరాజు, వేదుల వాసుదేవరావు, కామేశ్వరశర్మ శ్రీమతి రాధారాణి మరియు సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
...............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి