ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారంతో వివిధ కృత్యాలను చేసారు.అంకెలతో ఇల్లు,తెలుగు అక్షరాలతో చెట్టు, ఆంగ్ల అక్షరరాతో నెమలి,
మొదలగు చిత్రాలను తయారు చేసారు.పద్యాలతోపాటలు,కుర్చీలతో ఆటలు ఆడి రోజంతా ఉల్లాసంగా గడిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే ఉండటం వలన వారం అంతా అభ్యసన ఒత్తిడి లేకుండా ఆ రోజంతా వారి అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యాలను వెలికితీయవచ్చునని, విద్యార్థులకు మానసిక, శారీరక ఆనందానికి ఈ ప్రోగ్రాం బాగా ఉపయుక్తంగా ఉంటుందీని అన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి