స్త్రీ విద్య సంఘంబు చేతనత్వంబని
వెలుగునింపుననుచు పిలుపునిచ్చి
భావిభారతమున పడతికై చక్కని
గతులనునిల్పగా కలముబట్టి
అంధవిశ్వాసంబునణచివేయగ తన
పలుకులోధీతోడ బలముజూపి
సత్యశోధన యను సంస్థతో ప్రజలలో
మానసంబునగూల్చె మలినములను
జ్యోతిరావుపూలెసతిగ యోధ్ధతాను
సంఘ సంస్కరణంబుకై సతముమతిని
చింతనలు జేసిజగతిలోచిరమువెలిగె
ప్రగతిబాటలోసావిత్రిబాయిపూలె
సావిత్రి బాయిపూలె
మహిళా ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా
సోదరి మహిళా ఉపాధ్యాయినిలకు
అభినందనలు తెలుపుతూ
మల్లావఝల చంద్రశేఖర శర్మ టి.జి.టి మద్దూరు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి