అలలను లెక్కిస్తే
అలజడి తగ్గేనా!?
అడుగులు లెక్కిస్తే
అలసట తీరేనా!?
భయానికి అలుసిస్తే
భారం తగ్గేనా!?
బలాలు మరిస్తే
బ్రతుకు సాగేనా!?
వ్యర్థాలకు విలువిస్తే
అర్థం నిలిచేనా!?
స్వార్థం పెచ్చు మీరితే
సంతోషం నిలిచేనా!?
కాలాన్ని నిందిస్తే
గతులు మారేనా!?
కష్టాన్ని కాదంటే
ఫలితం దక్కేనా!?
గమనం ఆపేస్తే
పయనం సాగేనా!?
గమ్యాన్ని వదిలేస్తే
గతుకులు తొలగేనా!?
చింతతో దుఃఖిస్తే
చిక్కులు వీడేనా?
ఎంతగా ఏడ్చినా
గతాలు దొరికేనా!?
చీకటికి భయపడితే
వెలుగు వచ్చేనా?
వెలుగు వచ్చాక
చీకటి నిలిచేనా?...
వేకువ ఒక వరమంటూ వచ్చే
🌸🌸సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి