అద్భుతం ఈ నందీ తీర్థ కళ్యాణి క్షేత్రం: - - యామిజాల జగదీశ్






సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడి కృప వలన కర్ణాటకలోని మల్లేశ్వరంలో, అత్యంత  పురాతనమైన ఓ అద్భుత ఆలయం ఉంది. ఇక్కడి ప్రత్యేకత నంది నోటి నుండి ప్రవహించే నీరు......


మన పూర్వీకుల కాలంలో నిర్మితమైన అన్ని దేవాలయాలు ముఖ్యమైనవి. ఏదో ఒక అద్భుతంతో కూడినవే ఇవన్నీనూ. ఇప్పుడు ఇలాంటి ఆలయాలను నిర్మించడం సాధ్యమైతే, మనం దాని గురించి కలలో కూడా ఊహించలేము.


కంచి కామాక్షి అమ్మన్ ఆలయం నుండి తంజావూరు పెద్ద ఆలయం వరకు, ఆ కాలంలో ఆలయాలు ఎంత అద్భుతంగా నిర్మించినవో కదూ. అదే విధంగా, మన ఊహకందని కొన్ని అపూర్వ ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి.


కర్ణాటకలోని ఒక ఆలయంలో, పరిశోధకులను అబ్బురపరిచే వింతైన నంది విగ్రహం ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అదే మరి.


"ఇంతకూ ఈ ఆలయం ఎక్కడ ఉంది?"


కర్ణాటకలోని మల్లేశ్వరం అనే పట్టణంలో, "దక్షిణ ముఖ నంది తీర్థ కళ్యాణి ఆలయం" ఉంది. ఈ ఆలయం అతి పురాతమైనదని పరిశోధనలో తేలింది


ఇక్కడి నంది నోటి నుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉండటమే అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. సాధారణంగా ఇతర దేవాలయాలలో, నంది విగ్రహం శివలింగానికి ఎదురుగా ఉంటుంది. కానీ ఈ ఆలయంలో, నంది విగ్రహం శివుని శిరస్సుపై ఉంది.


ఒక ప్రత్యేకత ఏమిటంటే, నంది నోటి నుండి వస్తున్న నీరు. అదీనూ ఎల్లప్పుడూ నీరు పారడం. ఇదేదో కృత్రిమంగా అనిపించదు. చాలా వాస్తవికంగా అమర్చినది. ఆ నీరు ఎల్లప్పుడూ శివలింగాన్ని నడుపుతుండటం. 


అయితే ఇదెలాగనేది ఇప్పటికీ

ఎవరికీ తెలియని రహస్యం..!


నంది నోటి నుండి పారుతున్న నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎవరూ కనుగొనలేకపోయారంటే మీరు నమ్మగలరా? అవును, ఇంకా ఎవరూ కనుగొనలేకపోయిన మాట నిజం. 


ఈ తీర్థం అరుదైన శక్తిని కలిగి ఉందని, దీనిని తాగడం వల్ల నయం కాని వ్యాధులు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. దీని కారణంగా, ఈ ఆలయాన్ని ఎల్లప్పుడూ ఎక్కువ మంది భక్తులు సందర్శిస్తుంటారు.


శివుడికి అభిషేకం చేసిన తర్వాత, ఈ తీర్థం ఎదురుగా ఉన్న ఆలయ చెరువులో కలిసిపోవడం గమనార్హం.


విశ్వాసం ఉన్నవారు ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించాలి. మీరు తప్పకుండా అనుభూతి చెందుతారు!


 

కామెంట్‌లు
Popular posts