మంచి జ్ఞాపకాలు!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
జ్ఞాపకాలకు వయసు ఉండదు 
మంచి జ్ఞాపకాలు 
ప్రపంచ కట్టడాల్లాంటివి
వాటిని కూల్చకండి!!!!

జ్ఞాపకాలు 
దట్టమైన అడవుల్లాంటివి
వాటిని కాల్చేయకండి!!

సముద్రం లాంటి దుఃఖము 
సరస్సు లాంటి సంతోషం 
జ్ఞాపకాలే 
వాటిని కన్నీటి మేఘాలుగా మార్చకండి!!?

వెలకట్టలేని అనుభూతులు 
సముద్ర గర్భంలోని ఆణిముత్యాల్లాంటివి 
వాటిని 
జ్ఞాపకాలుగా కూర్చి 
కలల అలల తీరానికి చేర్చండి.!!!

వెన్నెల పూలల్లో మనసుల మల్లెల్లో 
పరిమళాల సంభాషణలు 
చూపుల మాటల్లో - మాటలతోటల్లో
మధువులు - జ్ఞాపకాలుగా కూర్చి 
పూలదండలల్లండీ.....!!

జాలువారే కాలం జలంతో 
ఉయ్యాల లాంటి జ్ఞాపకాల జలపాతాలు 
హృదయం లాంటి జ్ఞాపకాల నదులు 
నిర్మించండి........!!

ఎండిపోయిన గుండెల్లో 
మంచు కొండల్లాంటి
మంచి జ్ఞాపకాలని సృష్టించండి.!!!

జనన మరణాల్లా-ఉదయ సంధ్యల్లా
జ్ఞాపకాలకు పుట్టుక గిట్టుకలుంటావీ

బ్రతికినంతకాలం 
జీవితం - మంచి జ్ఞాపకాలను 
ఋతువుల్లా మార్చుకుంటూనే ఉంటుంది.!!

డా ప్రతాప్ కౌటిళ్యా.



కామెంట్‌లు