ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన అతిపెద్ద తెలుగు సాహితీ సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా నిర్వహించిన తెలుగు చిత్ర కవితా పోటీలలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం వ్రాసిన "వేషం చూసి మోసపోకుమా" అనే నేటి సమాజస్థితిని తెలియచేసి కవితకు టాప్ 20 లో విజేతగా ప్రకటించి సంస్థ వ్యవస్థాపకులు జాషువా, బోయి భీమన్న పురస్కార గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు, జాతీయ అధ్యక్షురాలు కవియత్రి శ్రీమతి ఈశ్వరి భూషణం గారు జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.పార్థసారథి గారు కార్యనిర్వాహక సభ్యులు శుభాకాంక్షలు తెలియచేస్తు వర్చువల్ విధానంలో అభినందన ప్రశంసా పత్రం అందచేసారు. బదులుగా ప్రసాద్ మాష్టారు. అంతర్జాతీయ శ్రీ శ్రీ కళా వేదిక నుంచి నూతన సంవత్సరం నాడు లభించిన ప్రశంసా పత్రం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు ప్రసాద్ మాస్టారుకి
శుభాకాంక్షలు తెలియచేసారు.
..........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి