అంతర్జాతీయ ప్రముఖ సాహితీ ,సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక తెలుగు అసోషియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోషియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం నిరంతరం తెలుగు సాహితీ రంగానికి కృషి చేస్తున్న ప్రతిభకు గుర్తింపు గా'అక్షర కిరీటి'పురస్కారం తో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో మొమెంటో ప్రశంసా పత్రం పూలదండ వేదమంత్రాలతో సంస్థ వ్యవస్థాపకులు కవి జాషువా మరియు డాక్టర్ బోయి భీమన్న పురస్కార గ్రహీత కళారత్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు,శ్రీనాధ సార్వభౌముని వంశజులు డాక్టర్ కావూరి శ్రీనివాసరావు గారు జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి ఈశ్వరీ భూషణం గారు హాస్యబ్రహ్మ కామవరపు కామేశ్వరరావు గారు మున్నగు ప్రముఖుల సమక్షంలో సరస్వతీ సభలో స్వహస్తలతో ఘనంగా సత్కరించారు. బదులుగా నూతన సంవత్సరంలో ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని కవి రచయిత ప్రసాద్ మాస్టారు చెప్పారు
శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారు.
...............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి